ఇర్ఫాన్‌​ పఠాన్‌, కంగనా రనౌత్‌ మధ్య మాటల యుద్ధం

13 May, 2021 21:53 IST|Sakshi

ఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌, బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ల మధ్య సోషల్‌మీడియా వేదికగా మాటలయుద్దం నడిచింది. పాలస్తీనా, ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి పరస్పరం ట్వీట్లతో విమర్శించుకున్నారు.

విషయంలోకి వెళితే.. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పాలస్తీనాలో జరుగుతున్న హింస గురించి ట్వీట్ చేశాడు. "నేను పాలస్తీనాకు మద్దతు తెలపడం లేదు. పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్‌ కొనసాగిస్తున్న విధ్వంసకాండను తప్పు బడుతున్నా. మీకు కొంచెం మానవత్వం కూడా ఉంటే, పాలస్తీనాలో ఏమి జరుగుతుందో తెలుస్తుంది. మీరు మద్దతు ఇవ్వండి" అంటూ ట్వీట్‌ చేశాడు. అయితే పఠాన్‌ పాలస్తీన్‌కు మద్దతు ఇవ్వడంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ మండిపడింది. పఠాన్‌ను టార్గెట్‌ చేస్తూ .." ఇర్ఫాన్ పఠాన్‌కు ఇతర దేశాలపై అంత ప్రేమ ఉంది. కానీ తన సొంత దేశంలో బెంగాల్‌ జరుగుతున్న హింసపై ట్వీట్ పెట్టలేకపోయాడు" అంటూ విమర్శలు చేసింది.  

కంగనా ట్వీట్‌పై ఇర్ఫాన్ పఠాన్ ఘాటుగానే బదులిచ్చాడు. "నా ట్వీట్లన్నీ మానవత్వం లేదా దేశస్థుల కోసమే. ఇందులో దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి అభిప్రాయం ఉంది. మరోవైపు కంగనా మాత్రం ఇలాంటి వివాదాస్పద ట్వీట్లతో తన అకౌంట్‌ను తానే బ్లాక్‌ చేసేలా వ్యవహరిస్తుంది. ఆమె ప్రవర్తన నాకు నచ్చలేదు." అంటూ పేర్కొన్నాడు. ఇప్పుడు వీరిద్దరి మధ్య వివాదం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది? మరోవైపు ఇర్ఫాన్ ఫ్యాన్స్ కూడా కంగనా వ్యవహారంపై మండిపడుతున్నారు.
చదవండి: వాడిలో ఇన్ని వేరియేషన్స్‌ ఉన్నాయని నాకు తెలియదు


Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు