European Cricket League: మరి ఇంత తొందరేంటి.. రనౌట్‌ చేయాల్సింది

16 Mar, 2022 17:04 IST|Sakshi

క్రికెట్‌లో బౌలర్‌ బంతి విడవకముందే బ్యాటర్‌ క్రీజు దాటితే అతన్ని రనౌట్‌ కాల్‌ చేయొచ్చు. దీనినే మన్కడింగ్‌ అని కూడా పిలుస్తారు. అయితే ఇది క్రీడాస్పూర్తిని దెబ్బతీసేలా ఉందని.. మన్కడింగ్‌ను నిషేధించాలంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు. వారి వాదనలు వ్యతిరేకిస్తూ ఇటీవలే మన్కడింగ్‌ను చట్టబద్దం చేస్తూ మెరిల్‌బోర్న్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(ఎంసీసీ) కొత్త సవరణ తీసుకొచ్చింది. ఇకపై మన్కడింగ్‌ను రనౌట్‌గా మారుస్తున్నట్లు ఎంసీసీ పేర్కొంది. తాజాగా యురోపియన్‌ క్రికెట్‌ లీగ్‌లో బౌలర్‌కు మన్కడింగ్‌(రనౌట్‌) చేసే అవకాశమొచ్చినప్పటికి క్రీడాస్పూర్తిని ప్రదర్శించడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

విషయంలోకి వెళితే.. బౌలర్‌ బంతి వేయకముందే నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ సగం క్రీజు వరకు పరిగెత్తాడు. దీంతో బౌలర్‌కు రనౌట్‌ చేసే అవకాశం వచ్చినప్పటికి సైలెంట్‌ అయిపోయాడు. అంపైర్‌ ఔట్‌ చేయమని చెప్పినప్పటికి సదరు బౌలర్‌.. వద్దులే అన్నట్లుగా సైగ చేశాడు. దీంతో బౌలర్‌పై క్రికెట్‌ ఫ్యాన్స్‌ ప్రశంసల వర్షం కురిపించారు. మన్కడింగ్‌ చేసే అవకాశమున్నప్పటికి క్రీడాస్పూర్తి ప్రదర్శనతో ఆకట్టుకున్నావు అంటూ కామెంట్‌ చేశారు.

మరిన్ని వార్తలు