Common Wealth Games: బర్మింగ్‌హామ్‌లో ‘బెస్టాఫ్‌ లక్‌’

25 Aug, 2021 08:37 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌ నగరం 22వ కామన్వెల్త్‌ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది. జూలై 28నుంచి ఆగస్టు 8 వరకు ఈ పోటీలు జరుగుతాయి. మెగా ఈవెంట్‌కు మరో సంవత్సరం ఉన్న నేపథ్యంలో ‘కౌంట్‌డౌన్‌’గా హైదరాబాద్‌లోని బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషన్‌ భారత క్రీడాకారులతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది.

కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించిన సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, సాయిప్రణీత్‌ తదితరులతో పాటు వచ్చే క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉన్న వర్ధమాన అథ్లెట్లు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిటీష్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ మాట్లాడుతూ... క్రీడల నిర్వహణ కోసం ఇంగ్లండ్‌ ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు, బరి్మంగ్‌హామ్‌ నగర విశిష్టతల గురిం చి వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లు ఎక్కువ సంఖ్యం లో సీడబ్ల్యూజీ–2022లో పాల్గొని పతకాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు

అంకితా రైనా పరాజయం 

సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌ మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ప్లేయర్‌ అంకితా రైనాకు  అర్హత పోరులోనే నిరాశ ఎదురైంది. హోరాహోరీగా తన సమ ఉజ్జీలాంటి ప్రత్యర్థితో సాగిన పోరులో చివరకు ప్రపంచ 193వ ర్యాంకర్‌ అంకితకు ఓటమి తప్పలేదు. క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్‌లోనే ఆమె అమెరికాకు చెందిన ప్రపంచ 194వ ర్యాంకర్‌ జేమీ లోయబ్‌ చేతిలో 3–6, 6–2, 4–6 తేడాతో ఓటమిపాలైంది. 

మరిన్ని వార్తలు