ఇది కదా క్రికెట్‌ అంటే: వార్న్‌

26 Oct, 2021 21:02 IST|Sakshi

వచ్చే ఏడాది ఐపీఎల్‌కు మరో రెండు జట్లు కొత్తగా రావడం ఒక ఎత్తైతే.. రికార్డు స్థాయిలో టెండర్లు దాఖలు చేసి రావడం మరొక ఎత్తు.  ఐపీఎల్‌ కొత్త జట్ల కోసం సోమవారం జరిగిన జరిగిన బిడ్డింగ్‌లో  రాజీవ్‌ ప్రతాప్‌ సంజీవ్‌ గోయెంకా (ఆర్‌పీఎస్‌జీ) వెంచర్స్‌ లిమిటెడ్‌ రూ.7,090 కోట్లు  వెచ్చించి లక్నో ఫ్రాంచైజీని సొంతం చేసుకోగా,  సీవీసీ క్యాపిటల్స్‌ రూ. 5,625 కోట్లకు అహ్మదాబాద్ ప్రాంఛైజీని సొంతం చేసుకుంది. దాంతో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)కు రూ. 12,715 కోట్లు వచ్చిపడింది. ఓవరాల్‌గా 22 కంపెనీలు బిడ్డింగ్‌లపై ఆసక్తి చూపడం క్రికెట్‌ గేమ్‌ సత్తా ఎలా ఉంటుందో మరొకసారి ప్రపంచానికి తెలిసేలా చేసింది.

రెండు జట్ల కోసం భారీ పోటీ నెలకోవడం క్రికెట్‌ ప్రేమికుల్ని, విశ్లేషకుల్ని ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది.  దీనిపై ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ తన ట్వీటర్‌ హ్యాండిల్‌లో స్పందించాడు. ‘ వావ్‌.. కొత్తగా రాబోతున్న రెండు జట్లకు కంగ్రాట్స్‌. రెండు జట్ల కోసం జరిగిన పోటీలో ఇంతటి భారీ స్థాయిలో ధనం చేకూరడం క్రికెట్‌ అంటే ఏమిటో ప్రపంచానికి చాటేలా చేసింది.  ఇది కదా క్రికెట్‌ అంటే. ఈ గ్రహంపై క్రికెట్‌ రెండో అతి పెద్ద ఆట ఎలా  అయ్యిందో ఐపీఎల్‌ బిడ్డింగ్‌ ద్వారా తెలుస్తోంది. వెల్‌డన్‌ సౌరవ్‌ గంగూలీ, బీసీసీఐ’ అని వార్న్‌ పోస్ట్‌ చేశాడు.

చదవండి: IPL New Teams: అదానీని తలదన్నేసిన గోయెంకా గ్రూప్‌.. మరి సీవీసీ క్యాపిటల్‌ గురించి తెలుసా?

మరిన్ని వార్తలు