T20 WC: 'మ్యాచ్‌కు అదే టర్నింగ్‌ పాయింట్‌.. లేదంటే విజయం మాదే'

24 Feb, 2023 12:29 IST|Sakshi

ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకోవాలనుకున్న భారత మహిళల జట్టు ఆశలు మరోసారి ఆవిరైపోయాయి. మహిళల టీ20 ప్రపంచకప్‌-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్‌లో 5 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో ఈ మెగా టోర్నీ నుంచి టీమిండియా ఇంటిముఖం పట్టింది. అయితే కీలక సమయంలో టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌కౌర్‌ రనౌట్‌గా వెనుదిరగడంతో ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓటమిపాలైంది. 

ఇక మ్యాచ్‌ అనంతరం ఓటమిపై టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌కౌర్‌ స్పందించింది. పోస్ట్‌ మ్యాచ్‌ ప్రెజెంటేషన్‌లో హర్మన్‌ మాట్లాడుతూ.. "నా బ్యాట్‌ అలా ఇరుక్కుపోయి ఉండకపోయింటే.. ఆ పరుగు ఈజీగా వచ్చేంది. ఆఖరి వరకు క్రీజులో నేను ఉండి ఉంటే, మా జోరు మ్యాచ్‌ను ఒక ఓవర్‌ ముందే ఫినిష్‌ చేసేవాళ్లం. అయినప్పటకి  నా తర్వాత  దీప్తి శర్మ, రిచా ఘోష్ ఉన్నారు. కాబట్టి మేము గెలుస్తాం అనే నమ్మకం నాకు ఉండేది. రిచా గత కొన్ని మ్యాచ్‌ల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసింది.

కానీ నేను ఔటైన తర్వాత ఏడెనిమిది డాట్ బాల్స్ వచ్చాయి. అదే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్. ఇక నేను జెమిమా క్రీజులో ఉన్నప్పుడు సులువైన బంతులను బౌండరీలుగా మలచాలని అనుకున్నాం. మాకు మొదటి నుంచి ఓవర్‌కు 8 పరుగులు అవసరం. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మేము బ్యాటింగ్‌ చేశాం.జెమిమా అద్భుతంగా ఆడింది.

నాన్-స్ట్రైకర్‌గా ఉన్న భాగస్వామి నుంచి ఇలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తే చాలా బాగుంటుంది. ఇక రనౌట్‌ కూడా ఈ మ్యాచ్‌కు టర్నింగ్‌ పాయింట్‌. ఆస్ట్రేలియాను 170కి పరిమితం చేస్తే చాలు అని మేము ముందే అనుకున్నాం. ఆ స్కోర్‌ను మేము చేధిస్తామని మాకు నమ్మకం ఉండేది. కానీ నా రనౌట్‌తో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది" అని ఆమె పేర్కొంది.
చదవండిT20 WC: 'నేను ఏడుస్తుంటే నా దేశం చూడకూడదు.. అందుకే అలా చేశా'

>
మరిన్ని వార్తలు