ఇలా చేస్తే స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌ చూడొచ్చు!

11 Apr, 2021 08:17 IST|Sakshi

‘నెగెటివ్‌’ ఉంటేనే వాంఖడేలో ప్రవేశం

ముంబై: తమ రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో ముంబై క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ ప్రొటోకాల్‌ ప్రకారం...వాంఖడే వేదికగా జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే తమ అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులకు ఆర్‌టీ పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షను తాము చూడాలనుకునే మ్యాచ్‌కు 48 గంటలలోపు చేయించుకోవాల్సి ఉంటుందని అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులకు ఎంసీఏ కార్యదర్శి సంజయ్‌ నాయక్‌ స్పష్టం చేశారు.

అందులో నెగెటివ్‌ అని వస్తేనే మ్యాచ్‌ను చూసేందుకు స్టేడియంలోకి అడుగుపెట్టనిస్తామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారు కూడా నెగెటివ్‌ రిపోర్టును కలిగి ఉండాలని సంజయ్‌ తెలిపారు. ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లకు వాంఖడే ఆతిథ్యమివ్వనుంది. ప్రత్యేకంగా మహరాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవుతూ ఆ రాష్ట్ర ప్రజలను వణికిస్తున్న తెలిసిందే. కొన్ని రోజుల క్రితం స్టేడియం సిబ్బంది కరోనా వైరస్‌ బారిన పడిన సంగతి తెలిసిందే.
( చదవండి: మరోసారి తన విలువేంటో చూపించిన రైనా 

మరిన్ని వార్తలు