వావ్‌.. పదికి పదికి గెలిచారు

7 Sep, 2020 10:09 IST|Sakshi

సీపీఎల్‌ టి20 టోర్నీలో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ జైత్రయాత్ర

ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ గెలుపు

టరూబా: కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌) టి20 టోర్నమెంట్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ (టీకేఆర్‌) జట్టు లీగ్‌ దశను అజేయంగా ముగించింది. ఆడిన 10 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌ జట్టుతో ఆదివారం జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ 9 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత సెయింట్‌ కిట్స్‌ జట్టు 18.2 ఓవర్లలో 77 పరుగులకే కుప్పకూలింది. నైట్‌రైడర్స్‌ బౌలర్‌ ఫవాద్‌ అహ్మద్‌ 21 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.(చదవండి: త్వరలో ఆటకు బెల్‌ బైబై)

అనంతరం నైట్‌రైడర్స్‌ జట్టు 11.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 78 పరుగులు చేసి గెలుపొందింది. వెబ్‌స్టర్‌ (33 బంతుల్లో 41 నాటౌట్‌; 5 ఫోర్లు, సిక్స్‌) మెరిశాడు. మొత్తం ఆరు జట్లు రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్థతిలో తలపడుతున్న ఈ టోర్నీలో టీకేఆర్‌ జట్టు లీగ్‌ దశలో 20 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది. టీకేఆర్‌ జట్టుతోపాటు గయానా అమెజాన్‌ వారియర్స్, సెయింట్‌ లూయిస్‌ జూక్స్, జమైకా తలవాస్‌ జట్లు కూడా సెమీఫైనల్‌ చేరాయి. సోమవారం విశ్రాంతి దినం. 8వ తేదీన సెమీఫైనల్స్‌ జరుగుతాయి. ఫైనల్‌ను 10వ తేదీన నిర్వహిస్తారు.(చదవండి: మనకు పనిభారం అధికంగా ఉన్నట్లు అనిపిస్తే..: కోహ్లి)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు