బంతి ఎలా పడిందన్నది చూడకుండానే.. షాక్‌ తిన్న బౌలర్‌

30 Aug, 2021 19:00 IST|Sakshi

సెంట్‌కిట్స్‌: కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌ 2021)లో సెంట్‌ లూసియా కింగ్స్‌, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ మధ్య ఆదివారం లీగ్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో సెంట్‌ లూసియా కింగ్స్‌ 5 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విషయం కాసేపు పక్కనపెడితే సెంట్‌ లూసియా కింగ్స్‌ ఓపెనర్‌ ఆండ్రీ ఫ్లెచర్‌ కొట్టిన ఒక సిక్స్‌ వైరల్‌గా మారింది. ఇసురు ఉడాన వేసిన బంతిని ఫ్లెచర్‌ డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా సిక్స్‌ కొట్టాడు. అయితే ఫ్లెచర్‌ కనీసం బంతి ఎక్కడ పడిందనేది చూడకుండానే ఆడాడంటే అతని కాన్ఫిడెంట్‌ ఎంతలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఇన్నింగ్స్‌ 8.4 ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది.

చదవండి: 20 ఓవర్లలో 32 పరుగులు.. టీ20 మ్యాచ్‌ను కాస్త టెస్టు మ్యాచ్‌గా

కాగా భారీ షాట్లకు పెట్టింది పేరైన ఫ్లెచర్‌ను అందరూ ముద్దుగా స్పైస్‌మన్‌ అని పిలుచుకుంటారు.కాగా ఈ మ్యాచ్‌లో ఫ్లెచర్‌ 28 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన సెంట్‌ లూసియా కింగ్స్‌ 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. టిమ్‌ డేవిడ్‌ 43 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచారు. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ బౌలర్‌ రామ్‌పాల్‌ 3 వికెట్లతో చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ట్రిన్‌బాగో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేసి 5 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యింది. టిమ్‌ స్టిఫర్ట్‌ 16 బంతుల్లో 40 పరుగులు చేసినప్పటికి గెలిపించలేకపోయాడు.

చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఆల్‌రౌండర్

మరిన్ని వార్తలు