గేల్‌ సిక్స్‌ కొడితే మాములుగా ఉంటుందా.. గ్లాస్‌ పగిలిపోయింది

27 Aug, 2021 13:29 IST|Sakshi

వెస్ట్రన్‌పార్క్‌: యునివర్సల్‌ బాస్ క్రిస్‌ గేల్‌ అంటేనే విధ్వంసానికి మారుపేరు. భారీ సిక్సర్లు అలవోకగా బాదే గేల్‌ ఎన్నోసార్లు తన పవర్‌హిట్టింగ్‌ను రుచి చూపించాడు. ఫాంలో ఉన్నాడంటే ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు. తాజాగా కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2021లో గేల్‌ కొట్టిన భారీ సిక్స్‌కు స్కోర్‌కార్డ్‌ డిస్‌ప్లే చేసే స్ర్కీన్‌గ్లాస్‌ పగిలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

లీగ్‌లో సెంట్‌ కిట్స్‌ నెవిస్‌ పాట్రియోట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్‌.. బార్బడోస్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. జాసన్‌ హోల్డర్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌ ఐదో బంతిని నేరుగా స్ట్రెయిట్‌ సిక్స్‌ సంధించాడు. బంతి నేరుగా ఉ‍న్న స్కోరుబోర్డు స్క్రీన్‌కు తగిలింది. ఇంకేముంది ఇది చూసిన నెటిజన్లు ''గేల్‌ సిక్స్‌ కొడితే మాములుగా ఉండదు కదా.. గ్లాస్‌ పగిలింది'' అంటూ కామెంట్లు చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో గేల్‌ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 9 బంతులెదుర్కొన్న గేల్‌ ఒక సిక్సర్‌, ఒక ఫోర్‌తో 12 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. 

ఈ మ్యాచ్‌లో సెంట్‌ కిట్స్‌ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన సెంట్‌కిట్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. టాపార్డర్‌ విఫలమైనప్పటికి లోయర్‌ ఆర్డర్‌లో ష్రెఫాన్‌ రూథర్‌ఫర్డ్‌ 53 నాటౌట్‌, డ్వేన్‌ బ్రావో 47 నాటౌట్‌తో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన బార్బడోస్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. షై హోప్‌ 44 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మిగిలినవారు విఫలమయ్యారు. సెంట్‌ కిట్స్‌ బౌలింగ్‌లో షెల్డన్‌ కాట్రెల్‌, డొమినిక్‌ డ్రేక్స్‌ చెరో రెండు వికెట్లు, ఫాబియన్‌ అలెన్‌ ఒక వికెట్‌ తీశాడు.

చదవండి: ENG Vs IND: టీమిండియా చెత్త ప్రదర్శన.. కోహ్లి, రోహిత్‌లదే బాధ్యత

మరిన్ని వార్తలు