ఆటగాళ్లపై జాత్యాహంకార వ్యాఖ్యలు నిజమే: సీఏ

27 Jan, 2021 14:39 IST|Sakshi

సాక్షి. న్యూఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇటీవల ముగిసిన సిడ్నీ టెస్టులో భారత ఆటగాళ్లు జాతి వివక్షను ఎదుర్కొన్న మాట వాస్తవమేనని క్రికెట్ ఆస్ట్రేలియా అంగీకరించింది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించింది. భారత ఆటగాళ్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లు మైదానంలో ఫీల్డింగ్ చేస్తుండగా ఆసీస్ అభిమానులు జాత్యహంకార వ్యాఖ్యలు చేశారని టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ చేపట్టింది. చదవండి: చెన్నై వేదికగా ఐపీఎల్‌ 2021 మినీ వేలం

సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తించామని.. నిబంధనల ప్రకారం నిందితులను మైదానంలోకి అడుగుపెట్టకుండా దీర్ఘకాల నిషేధం విధిస్తామని సీఏ అధికారులు వెల్లడించారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు పుజారా, విహారి, అశ్విన్, పంత్లు గాయాల బారిన పడినప్పటికీ సమయోచితంగా పోరాడి మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో సఫలమయ్యారు. ఇక ఆఖరిదైన నాలుగో టెస్టులో భారత ఆటగాళ్లు మరోసారి చెలరేగి ఆసీస్ గడ్డపై చారిత్రక సిరీస్ విజయాన్ని సొంతం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు