T20 WC 2022: కొత్త జెర్సీ విడుదల చేసిన ఆస్ట్రేలియా.. 'సంక్రాంతి ముగ్గులాగే ఉంది'

14 Sep, 2022 12:54 IST|Sakshi

అక్టోబర్‌-నవంబర్‌ నెలలో ఆస్ట్రేలియా వేదికగా 2022 టి20 ప్రపంచకప్‌ జరగనున్న సంగతి తెలిసిందే. గతేడాది ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టైటిల్‌ ఎగురేసుకపోయింది. ఈసారి డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగనున్న ఆసీస్‌ బుధవారం ప్రపంచకప్‌కు ధరించబోయే నూతన జెర్సీని ఆవిష్కరించింది.

బ్లాక్‌ అండ్‌ యెల్లో కాంబినేషన్‌లో కాస్త కొత్తగా కనిపిస్తున్న జెర్సీపై ఎడమవైపు టి20 ప్రపంచకప్‌ 2022 అని రాసి ఉండగా.. మధ్యలో ఆస్ట్రేలియా అని ఇంగ్లీష్‌లో.. కుడివైపు ఆస్ట్రేలియా చిహ్నం ఉంటుంది. ఇక జెర్సీ కింది బాగంలో గ్రీన్‌, గోల్డ్‌ కాంబినేషన్‌లో ఆర్ట్‌ వర్క్‌ కనిపిస్తుంది.  జెర్సీకి సంబంధించిన విషయాలను క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. ''టి20 ప్రపంచకప్‌ కోసం కొత్త జెర్సీని ధరించడం గర్వంగా ఉంది'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా విడుదల చేసిన జెర్సీపై క్రికెట్‌ అభిమానులు వినూత్న రీతిలో కామెంట్స్‌ చేశారు. ''ఆస్ట్రేలియా కొత్త జెర్సీలోని డిజైన్‌ సంక్రాంతి ముగ్గును తలపిస్తుంది'' అంటూ పేర్కొన్నారు.

ఇక అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 13 వరకు టి20 ప్రపంచకప్‌  జరగనుంది. అక్టోబర్‌ 16 నుంచి 23 వరకు క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. క్వాలిఫయింగ్‌లో భాగంగా గ్రూఫ్‌-ఏలో శ్రీలంక, నమీబియా, ఊఏఈ, నెదర్లాండ్స్‌ పోటీ పడుతుండగా.. గ్రూఫ్‌-బిలో వెస్టిండీస్‌, స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌, జింబాబ్వేలు ఉన్నాయి. క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లు సూపర్‌-12 దశకు చేరుకుంటాయి.

ఇక సూపర్‌-12 దశలో  గ్రూఫ్‌-1లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, అఫ్గానిస్తాన్‌తో పాటు ఎ1, బి2 క్వాలిఫై జట్లు ఉండగా.. గ్రూప్‌-2లో టీమిండియా, పాకిస్తాన్‌, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌తో పాటు బి1, ఏ2 క్వాలిఫయింగ్‌ జట్లు ఉండనున్నాయి. ఇక అభిమానుల ఎంతగానో ఎదురుచూస్తున్న టీమిండియా-పాకిస్తాన్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 23న(ఆదివారం) జరగనుంది.

A post shared by Cricket Australia (@cricketaustralia)

చదవండి: సూర్యకుమార్‌లో మనకు తెలియని రొమాంటిక్‌ యాంగిల్‌..

టి20 ప్రపంచకప్‌కు కొత్త జెర్సీతో బరిలోకి టీమిండియా..

మరిన్ని వార్తలు