AUS VS ENG: యాషెస్‌ సిరీస్‌ షెడ్యూల్‌ విడుదల

19 May, 2021 15:35 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్‌ సిరీస్‌ షెడ్యూల్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) బుధవారం విడుదల చేసింది. ఈసీబీతో చర్చించిన అనంతరం ఈ షెడ్యూల్‌ రిలీజ్‌ చేసినట్లు సీఏ ప్రకటించింది. కాగా పురుషుల జట్టు షెడ్యూల్‌తో పాటు మహిళల జట్టు షెడ్యూల్‌ కూడా రిలీజ్‌ చేసింది. ఎప్పుడైనా నవంబర్‌-డిసెంబర్‌లో జరిగే యాషెస్‌ సిరీస్‌ టీ20 ప్రపంచకప్‌ కారణంగా డిసెంబర్‌- జనవరిలో జరగనుంది.

మొత్తం ఐదు టెస్టులు జరగనున్న నేపథ్యంలో  బ్రిస్బేన్‌ వేదికగా డిసెంబర్‌ 6 నుంచి 11 వరకు తొలి టెస్టు జరగనుంది. డిసెంబర్‌ 16 నుంచి 20 వరకు అడిలైడ్‌ వేదికగా జరగనున్న రెండో టెస్టు డే నైట్‌ పద్దతిలో నిర్వహించనున్నారు. ఇక బాక్సింగ్‌ డే టెస్టు డిసెంబర్‌ 26 నుంచి 30 వరకు మెల్‌బోర్న్‌లో జరగనుండగా.. నాలుగో టెస్టు సిడ్నీ వేదికగా జనవరి 5 నుంచి 9 వరకు జరగనుంది. ఇక సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టు పెర్త్‌ వేదికగా జనవరి 14 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు.

అయితే యాషెస్‌ కన్నా ముందు అఫ్గానిస్థాన్​తో ఓ టెస్టు మ్యాచ్​కు ఆసీస్ అతిథ్యం ఇవ్వనుంది. అఫ్గాన్ జట్టుకు కంగారులు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. 2019లో ఇంగ్లండ్‌లో జరిగిన యాషెస్‌ సిరీస్‌లో ఇరుజట్లు 2-2తో సమానంగా నిలిచినా.. అంతకముందు(2017-18లో) ఆసీస్‌ విజేతగా నిలవడంతో సంప్రదాయం ప్రకారం యాషెస్‌ ట్రోపీని ఆసీస్‌ తమవద్దే ఉంచుకుంది.  కాగా నవంబర్‌ -డిసెంబర్‌లో టీ20 ప‍్రపంచకప్‌ ముగిసిన తర్వాత ఆసీస్‌ జట్టు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనుంది. ఆ తర్వాతే ఇరు జట్ల మధ్య యాషెస్‌ సిరీస్‌ మొదలుకానుంది. ఇక మహిళల జట్ల యాషెస్‌ సిరీస్‌ జవవరి- ఫిబ్రవరి మధ్యలో ఒక టెస్టు, మూడు టీ20లు, మూడు వన్డేలు నిర్వహించనున్నారు.
చదవండి: 500కు పైగా వికెట్లు తీశాను, కానీ ఏం ప్రయోజనం

ఆస్ట్రేలియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ (పురుషుల జట్టు)- యాషెస్‌ షెడ్యూల్‌ 
తొలి టెస్టు: డిసెంబర్‌ 6 నుంచి 11 వరకు (బ్రిస్సేన్‌)
రెండో టెస్టు (డే నైట్‌): డిసెంబర్‌ 16 నుంచి 20 వరకు (అడిలైడ్‌)
మూడో టెస్టు( బాక్సింగ్‌ డే టెస్టు): డిసెంబర్‌ 26 నుంచి 30 వరకు (మెల్‌బోర్న్‌)
నాలుగో టెస్టు : జనవరి 5 నుంచి 9 వరకు (సిడ్నీ) 
ఐదో టెస్టు :జనవరి 14 నుంచి 18 వరకు (పెర్త్‌) 

మహిళల జట్టు- యాషెస్‌ షెడ్యూల్‌
జనవరి 27 నుంచి 30 వరకు కాన్‌బెర్రా వేదికగా టెస్టు మ్యచ్‌

ఫిబ్రవరి 4: తొలి టీ20 (సిడ్నీ)
ఫిబ్రవరి 6: రెండో టీ20 (సిడ్నీ)
ఫిబ్రవరి 10: మూడో టీ20 (అడిలైడ్‌)

ఫిబ్రవరి 13: తొలి వన్డే( అడిలైడ్‌)
ఫిబ్రవరి 16: రెండో వన్డే(మెల్‌బోర్న్‌)
ఫిబ్రవరి 19 : మూడో వన్డే( మెల్‌బోర్న్‌)

మరిన్ని వార్తలు