Shreyas Iyer: జోరుగా వర్షం.. టీమిండియా ఆటగాడి కోసం రెండు గంటల నిరీక్షణ.. అభిమానం అంటే ఇదే

21 Jul, 2022 16:50 IST|Sakshi

క్రికెటర్లకు అభిమానులు ఉండడం సహజం. కానీ కొందరు వీరాభిమానులు ఉంటారు.. తమ అభిమాన ఆటగాడిని కలవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. ఇలాంటివి ఇంతకముందు చాలానే చూశాం. తాజాగా అలాంటి ఘటనే జరిగినప్పటికి పైన చెప్పుకున్న వాటితో పోల్చలేనప్పటికి చెప్పుకునే విషయమైతే దాగుంది. విషయంలోకి వెళితే.. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో ఉంటున్న షిజారా.. టీమిండియా క్రికెటర్‌ శ్రేయాస్‌ అయ్యర్‌కు వీరాభిమాని. 

టీమిండియా మూడు వన్డేలు, ఐదు టి20 మ్యాచ్‌లు ఆడేందుకు వెస్టిండీస్‌ గడ్డపై అడుగుపెట్టింది. వన్డే సిరీస్‌కు ధావన్‌ నాయకత్వం వహించనుండగా.. రోహిత్‌, కోహ్లి, బుమ్రా, భువనేశ్వర్‌, పంత్‌, కేఎల్‌ రాహుల్‌, పాండ్యాలు వన్డేలకు విశ్రాంతినిచ్చింది. మొదట మూడు వన్డేలు జరగనుండడంతో ధావన్‌ నాయకత్వంలో యువ క్రికెటర్లు శ్రేయాస్‌ అయ్యర్‌, శుబ్‌మన్‌ గిల్‌, రుతురాజ్‌, దీపక్‌ హుడా, సంజూ శాంసన్‌లు పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో భారీ వర్షం కారణంగా ఇండోర్‌ ప్రాక్టీస్‌కే పరిమితమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు క్రికెటర్లు ప్రాక్టీస్‌ చేశారు.

కాగా శ్రేయాస్‌ అయ్యర్‌ వచ్చిన విషయం తెలుసుకున్న  షిజారా భారత ఆటగాళ్లు ప్రాక్టీస్‌ చేస్తున్న ఇండోర్‌ సెంటర్‌కు చేరుకుంది. జోరుగా వర్షం కురుస్తున్నప్పటికి దాదాపు రెండు గంటల పాటు శ్రేయాస్‌ అయ్యర్‌ కోసం ఎదురుచూసిన షిరాజా తాను అనుకున్నది సాధించింది. వేరొకరి ద్వారా విషయం తెలుసుకున్న అయ్యర్‌ ఆమెను కలిసి తన ఆటోగ్రాఫ్‌తో కూడిన ఒక చిన్న బ్యాట్‌ను అందించాడు. దీంతో సంతోషంలో మునిగిపోయిన షిరాజా.. ''రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ను చూద్దామని వచ్చా. కానీ వాళ్లు రాలేదు..అయితే నా అభిమాన క్రికెటర్‌ సంతకం మాత్రం పొందగలిగాను.. శ్రేయాస్‌ అయ్యర్‌ కోసం తన రెండు గంటల నిరీక్షణ ఫలించింది'' అంటూ యూట్యూబ్‌ చానెల్‌కు చెప్పుకొచ్చింది.

అయితే జూలై 29 నుంచి జరగనున్న టి20 సిరీస్‌కు కోహ్లి, బుమ్రా మినహా మిగతావాళ్లు టీమిండియాతో చేరనున్నారు. వన్డే సిరీస్‌లో ఆడనున్న ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌, అర్షదీప్‌సింగ్‌, ఆవేశ్‌ ఖాన్‌, దీపక్‌ హుడాలకు ఎంతగానో ఉపయోగపడనుంది. రానున్న టి20 ప్రపంచకప్‌కు టీమిండియా జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

చదవండి: పక్కవాళ్లు చెప్పేవరకు సోయి లేదు.. ఇంత మతిమరుపా?

మరిన్ని వార్తలు