Ravi Shastri: 'అర్థం పర్థం లేని ట్వీట్స్‌.. మాకేదో తేడా కొడుతోంది'

21 May, 2022 11:28 IST|Sakshi

టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి శుక్రవారం ఎప్పుడు లేనంత కొత్తగా కనిపించాడు. ఎక్కువగా క్రికెట్‌ సంబంధిత అంశాలపై చర్చలు జరిపే రవిశాస్త్రి ఉన్నట్లుండి తన లుక్‌ను పూర్తిగా మార్చేశారు. ఫ్లెష్‌ జాకెట్‌.. కూలింగ్‌ గ్లాసెస్‌.. మెడలో గోల్డ్‌ చైన్‌.. స్వాగ్‌లుక్‌ దుమ్మురేపాడు. అయితే ఈ ఫోటోలు షేర్‌ చేయడం వరకు ఓకే.. కానీ అసలు సమస్య అక్కడే మొదలైంది. హుందాగా కనిపించే రవిశాస్త్రిలో ఇన్ని వేరియషన్స్‌ ఉన్నాయా అన్న అనుమానం క్రికెట్‌ ఫ్యాన్స్‌కు కలిగింది.

ఈ నేపథ్యంలోనే రవిశాస్త్రి ట్విటర్‌ అకౌంట్‌ హ్యాక్‌కు గురైందంటూ పేర్కొన్నారు. ఎప్పుడు లేనంతగా రవిశాస్త్రి సింగిల్‌ లైన్‌ క్యాప్షన్స్‌ ఎక్కువగా జత చేశారు. మూడు ఫోటోలు షేర్‌ చేసిన ఆయన.. మూడు విభిన్నమైన లైన్స్‌ను క్యాప్షన్‌గా పెట్టారు. చివరగా..''నేను చిల్‌ అవ్వాలంటే ఏమి చెయ్యాలి''.. ''మంచి మూడ్‌లో ఉన్నా.. నన్ను ఏమైనా అడగొచ్చు'' అంటూ శాస్త్రి నుంచి ట్వీట్‌ వచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్‌.. ''అర్థం పర్థం లేని ట్వీట్స్‌.. కచ్చితంగా రవిశాస్త్రి అకౌంట్‌ హ్యాక్‌ అయినట్లే'' అంటూ  కన్‌ఫర్మ్‌ చేశారు.

కాగా రవిశాస్త్రి ప్రస్తుతం ఐపీఎల్‌ 2022(ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) బ్రాడ్‌కాస్ట్‌ డ్యూటీ నిర్వహిస్తున్నాడు. ఆటగాళ్ల బ్యాటింగ్‌, ఆటతీరు, ఫామ్‌ తదితర అంశాలపై చర్చలు జరుపుతూ బిజీబిజీగా ఉన్నాడు. కాగా గతేడాది టి20 ప్రపంచకప్‌ వరకు రవిశాస్త్రి టీమిండియా హెడ్‌కోచ్‌గా వ్యవహరించాడు. అయితేఘా టోర్నీలో టీమిండియా సూపర్‌-12 దశను దాటలేక చతికిలపడింది. అందునా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ చేతిలో భారత​ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. కాగా అతని హయాంలో టీమిండియా మేజర్‌ టోర్నీల్లో గెలవనప్పటికి స్వదేశంలో, విదేశాల్లో చారిత్రాక సిరీస్‌లు గెలిచింది. ఇక టీమిండియా తరపున మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన రవిశాస్త్రి టీమిండియా తరపున 80 టెస్టులు, 150 వన్డే మ్యాచ్‌లు ఆడాడు.

చదవండి: Ravi Shastri New Look: న్యూలుక్స్‌తో దుమ్మురేపుతున్న టీమిండియా మాజీ కోచ్‌

మరిన్ని వార్తలు