#Cheating: 'చీటింగ్‌ అనే పదం వాళ్ల బ్లడ్‌లోనే ఉంది!'

10 Jun, 2023 21:20 IST|Sakshi

క్రికెట్‌ను కొన్నేళ్ల పాటు ఆస్ట్రేలియా శాసించిందన్న మాట అందరికి తెలిసిందే. 1990 దశకం నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆస్ట్రేలియా క్రికెట్‌ను ఏకచత్రాధిపత్యంతో ఏలింది. ఈ రెండు దశాబ్దాల్లో కంగారూలు మూడు వన్డే వరల్డ్‌కప్‌లతో పాటు వన్డే, టెస్టుల్లో చాలాకాలం పాటు నెంబర్‌వన్‌గా కొనసాగారు. భయమంటే ఏంటో ఎరుగని జట్టుగా ఉన్న ఆస్ట్రేలియాకు టీమిండియా కూడా దాసోమయ్యింది. 2003 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ అందుకు చక్కటి ఉదాహరణ.

 స్టీవా, రికీ పాంటింగ్‌, మార్క్‌ వా, ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, మైకెల్‌ బెవాన్‌, గ్లెన్‌ మెక్‌గ్రాత్‌, షేన్‌ వార్న్‌, మైకెల్‌ క్లార్క్‌, జాసన్‌ గిలెస్పీ.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. జట్టుగా ఎంత బలంగా ఉంటుందో.. ఆధిపత్యం ప్రదర్శించడంలోనూ అంతే పట్టుదలగా ఉండేది. ఒక దశలో కంగారూలతో మ్యాచ్‌ అంటే ప్రత్యర్థి జట్లు కంగారు పడే పరిస్థితి ఉండేది. అయితే ఇన్ని ఘనతలున్నా కంగారూలకు చీటింగ్‌ అనేది పర్యాయపదంగా ఉండిపోయింది.

ఆస్ట్రేలియా ఎన్నో గొప్ప మ్యాచ్‌లు గెలిచినా కొన్నిసార్లు ఆ జట్టు చీటింగ్‌ చేసి గెలిచిన మ్యాచ్‌లే ఎక్కువగా గుర్తుండిపోయాయి. ముఖ్యంగా క్యాచ్‌ ఔట్‌ల విషయంలో ఆసీస్‌ ఆటగాళ్లు చేసిన చీటింగ్‌లు ఏ జట్టు చేయలేదని చెప్పొచ్చు. బాల్‌ టాంపరింగ్‌ నుంచి సాండ్‌ పేపర్‌ ఉదంతం వరకు అన్ని ఆస్ట్రేలియా ఖాతా నుంచి వచ్చినవే. అందుకే చీటింగ్‌ అనే పదం కంగారూల బ్లడ్‌లోనే ఉందంటారు క్రికెట్‌ అభిమానులు.

తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మరోసారి చీటింగ్‌ను బయటపెట్టింది. 444 పరుగుల టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన టీమిండియాకు గిల్‌, రోహిత్‌లు శుభారంభం అందించారు. 41 పరుగులు జోడించిన అనంతరం స్కాట్‌ బోలాండ్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడే యత్నంలో శుబ్‌మన్‌ గిల్‌ స్లిప్‌లో ఉ‍న్న గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 

క్యాచ్‌ తీసుకునే క్రమంలో డైవ్‌ చేసిన గ్రీన్‌ బంతిని అందుకున్నప్పటికి.. ఫోర్స్‌కు బంతిని నేలకు తాకించినట్లు కనిపించింది. దీంతో గిల్‌ రివ్యూకు వెళ్లాడు. అల్ట్రాఎడ్జ్‌లో కెమెరా యాంగిల్‌ పరిశీలించగా గ్రీన్‌ బంతిని అందుకున్నప్పటికి నేలకు తాకించినట్లు కనిపించింది. అయితే గ్రీన్‌ చేతి వేలు బంతి కింద ఉన్నట్లు థర్డ్‌అంపైర్ మైక్‌లో చెప్పి బిగ్‌ స్ర్కీన్‌పై గిల్‌ ఔట్‌ అని ప్రకటించాడు. ఈ నిర్ణయం రోహిత్‌, గిల్‌తో పాటు సగటు అభిమానిని ఆశ్చర్యపరిచింది.

గతంలోనూ పాంటింగ్‌, స్టీవ్‌ స్మిత్‌, మైకెల్‌ క్కార్ల్‌ కెప్టెన్లుగా ఉన్నప్పుడు ఇలాంటి చీటింగ్‌లు చాలానే జరిగాయి. అంపైర్లు కూడా ఆసీస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ ఫలితాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చి కూడా నాటౌట్‌ అని క్లియర్‌గా కనిపిస్తున్నా థర్డ్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయం ఇచ్చాడు. అయితే సాఫ్ట్‌ సిగ్నల్‌ నిబంధన ఉండి కూడా ఎందుకు ఉపయోగించడం లేదని అభిమానుల సందేహం వ్యక్తం చేస్తున్నారు.

A post shared by ICC (@icc)

చదవండి: #NotOut: థర్డ్‌ అంపైర్‌ చీటింగ్‌.. గిల్‌ ఔట్‌ కాదు

మరిన్ని వార్తలు