ముక్కంటి సేవలో క్రికెటర్‌ కేదార్‌ జాదవ్‌

9 Oct, 2022 08:25 IST|Sakshi
కేదార్‌జాదవ్‌కు ప్రసాదాలు అందజేస్తున్న ఆకర్ష్‌రెడ్డి  

సాక్షి, శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని భారత క్రికెటర్, ప్రముఖ ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌ దర్శించుకున్నారు. ఆలయ దక్షిణ గోపురం వద్ద శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తనయుడు బియ్యపు ఆకర్ష్‌ రెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు. పాలకమండలి సభ్యులు పసల సుమతి, మున్నారాయల్, ప్రత్యేక ఆహా్వనితులు పవన్‌ రాయల్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు