దుబాయ్‌ బంగారం: క్రికెటర్‌ కృనాల్‌ పాండ్యాకు షాక్‌

12 Nov, 2020 20:06 IST|Sakshi

సాక్షి, ముంబై : టీమిండియా ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యాకు భారీ షాక్‌ తగిలింది. ఐపీఎల్‌ 2020 క్రికెట్‌ సంబరం​ ముగిసిన అనంతరం భారత్‌కు తిరిగి వస్తుండగా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో పాండ్యాకు ఎదురుదెబ్బ తగిలింది. దుబాయ్‌ నుంచి బంగారంతోపాటు ఇతర విలువైన వస్తువులను అక్రమంగా తీసుకొస్తున్నారనే ఆరోపణలతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వర్గాలు అతడిని అడ్డుకున్నాయి.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకువచ్చాడనే ఆరోపణలతో క్రునాల్ పాండ్యాను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నామని డీఆర్‌ఐ వర్గాలు తెలిపాయి. దీనిపై నిర్దిష్ట సమాచారాన్ని వెల్లడించలేదు. కానీ పరిమితి కంటే ఎక్కువ బంగారం దీనితో పాటు మరికొన్ని విలువైన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. హార్దిక్ పాండ్య సోదరుడైన కృనాల్‌ ఎడమచేతి వాటం బ్యాట్స్ మాన్, బౌలర్‌గా రాణిస్తున్నారు. పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా పాండ్యా ప్రాతినిధ్యం వహించిన ముంబై ఇండియన్స్  ఐపీఎల్ 2020 టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు