కుటుంబంతో ఉంటే మాస్క్‌ ధరిస్తామా?

31 Aug, 2020 09:45 IST|Sakshi

ముంబై :   ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ఆడేందుకు వెళ్లిన చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే)లో క‌రోనా క‌ల‌క‌లం రేగిన సంగ‌తి తెల‌సిందే.  దీపక్ చహర్ స‌హా   ఇతర చెన్నై ఫ్రాంచైజీ సభ్యులు కరోనా బారిన పడ్డారు. అయితే తాజాగా వీరు వ్య‌వ‌హ‌రించిన నిర్ల‌క్ష్యం కార‌ణంగానే క‌రోనా బారిన‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. దీప‌క్ సోద‌రుడు, ముంబై ఇండియన్‌ లెగ్‌స్పిన్నర్‌ రాహుల్‌ చహర్ మ‌ధ్య జ‌రిగిన వాట్సాప్ సంభాష‌ణే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా క‌నిపిస్తుంది. క‌రోనా నేప‌థ్యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోమ‌ని రాహుల్ చెప్పిన ప్ర‌తీసారి దీప‌క్ వాటిని తేలిగ్గా కొట్టిప‌రేశాడు. ఇంట్లో ఉంటే ఈ  దూరాలేంటి  కుటుంబంతో ఉంటే మాస్క్‌ ధరించడమేంటి? అని చాలా లైట్ తీసుకున్నాడు. (సీఎస్‌కేలో 10మందికి కరోనా పాజిటివ్‌!)

ఈ నేప‌థ్యంలో దీప‌క్‌కు క‌రోనా సోక‌డంతో ప్ర‌స్తుతం ఈ వాట్సాప్ చాట్ వైర‌ల్‌గా మారింది. ఒక్క‌రు నిర్ల‌క్ష్యంగా ఉన్నా దాని ప్ర‌భావం ఇత‌రుల‌పై ప‌డుతుందంటూ ప‌లువురు నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక క‌రోనాకు గురైన దీప‌క్‌కు సోద‌రుడు రాహుల్ బాస‌ట‌గా నిలిచాడు. ధైర్యంగా ఉండు..త్వ‌ర‌గా కోలుకోవాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ రాహుల్ ట్వీట్ చేశాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) జ‌ట్టులో ఇప్ప‌టికే  10 మంది సీఎస్‌కే సభ్యులు కరోనా బారిన పడిన సంగ‌తి తెలిసిందే.. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ తమ క్వారంటైన్‌ను మరో వారం పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. (వెంటాడుతున్న కరోనా : ఆలస్యం కానున్న ఐపీఎల్‌)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు