మాంచెస్టర్‌ యునైటెడ్‌కు రొనాల్డో.. 12 ఏళ్ల తర్వాత 

28 Aug, 2021 09:15 IST|Sakshi

Cristiano Ronaldo.. పోర్చుగల్‌ స్టార్‌ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డొ 12 ఏళ్ల తర్వాత మాంచెస్టర్‌ యునైటెడ్‌కు తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మేరకు మాంచెస్టర్‌ యునైటెడ్‌ రెండేళ్ల కాలానికి గానూ 25 మిలియన్‌ యూరోస్‌కు(ఇండియన్‌ కరెన్సీలో దాదాపు రూ. 216 కోట్లు) ఒప్పందం కుదుర్చుకుంది. 2018 నుంచి జూవెంటెస్‌ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రొనాల్డొ బాలన్‌ డీఓర్‌ అండ్‌ చాంపియన్స్‌ లీగ్‌ టైటిల్‌లో జూవెంటస్‌ తరపున తన చివరి మ్యాచ్‌ను ఆడేశాడు.

ఇక 18 ఏళ్ల వయసులో 2003లో మాంచెస్టర్‌ యునైటెడ్‌కు తొలిసారి ప్రాతినిధ్యం వహించిన రొనాల్డొ 2009 వరకు ఆ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం 2009 నుంచి 2018 వరకు రియల్‌ మాడ్రిడ్‌కు ఆడాడు. 2018 నుంచి జూవెంటస్‌కు ఆడుతున్నాడు. ఇక రొనాల్డొ పోర్చుగల్‌ జట్టు తరపున 134 మ్యాచ్‌ల్లో 90 గోల్స్‌ సాధించాడు. ఫుట్‌బాల్‌ చరిత్రలో అత్యంత గొప్ప ప్లేయర్లలో స్థానం సంపాదించిన రొనాల్డొ తన కెరీర్‌లో 32 టైటిల్స్‌ అందుకున్నాడు. దాదాపు పదకొండు వందలకు పైగా మ్యాచ్‌ల్లో ఆడిన రొనాల్డొ 780 గోల్స్‌ సాధించాడు. 

చదవండి: ENG Vs IND: మళ్లీ వచ్చేశాడు.. ప్యాడ్స్‌ కట్టుకొని కోహ్లి స్థానంలో

మరిన్ని వార్తలు