7 సెకన్లు.. 60 మీటర్ల దూరం.. ఏమా వేగం

5 Jun, 2021 16:28 IST|Sakshi

ఫుట్‌బాల్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఉంటారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  మైదానంలో తమ ఫేవరెట్‌ ఆటగాడు బరిలో ఉన్నాడంటే ఇక ఫ్యాన్స్‌కు పండగే. ఫీల్డ్‌లో ఎందరు ఉన్నా.. అందరి కళ్లు తమ అభిమాన ఆటగానిపైనే ఉంటాయి. అలాంటి వారిలో పోర్చుగల్‌ స్టార్‌ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్లొ ఒకడు.  అంతర్జాతీయ ఫుట్‌బాలర్‌గా ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా 36 ఏళ్ల వయసులోనూ తన రన్నింగ్‌ పవర్‌ను చూపించి ఎంత ఫిట్‌గా ఉన్నాడో చెప్పకనే చెప్పాడు. 

విషయంలోకి వెళితే.. శుక్రవారం స్పెయిన్‌, పోర్చుగల్‌ మధ్య అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో రొనాల్డొ ఒక్క గోల్‌ కూడా కొట్టలేదు.. కానీ అభిమానులను మాత్రం ఎంటర్‌టైన్‌ చేశాడు.  మ్యాచ్‌ డ్రాగా ముగుస్తుందన్న దశలో 87.29 నుంచి 87.36 టైమ్‌లైన్‌ మధ్యలో 7 సెకన్లలో రొనాల్డొ చిరుత మించిన వేగంతో ఒక గోల్‌పోస్ట్‌ బాక్స్‌ నుంచి మరో గోల్‌పోస్ట్‌ బాక్స్‌కు పరిగెత్తాడు. దీనిని చూసిన అభిమానులు రొనాల్డొను వహ్వా అనకుండా  ఉండలేకపోయారు. దీనికి  సంబంధించిన వీడియో ఇప్పడు ట్రెండింగ్‌గా మారింది. అయితే రొనాల్డొకు మ్యాచ్‌ మధ్యలో చాలాసార్లు బంతిని గోల్‌పోస్టులోకి పంపించే అవకాశం వచ్చినా సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. ప్రస్తుతం జువెంటస్‌ క్లబ్‌తో పాటు పోర్చుగల్‌ జాతీయ జట్టుకు ఆడుతున్న రొనాల్డొ తన కెరీర్‌లో ఇప్పటివరకు అన్ని క్లబ్‌లు, అంతర్జాతీయ మ్యాచ్‌లు కలిపి దాదాపు 770కి పైగా గోల్స్‌ నమోదు చేశాడు.
చదవండి: ఇటాలియన్‌ గ్రాండ్‌ ప్రిలో విషాదం.. మోటో3 రైడర్‌ మృతి 

'రషీద్‌ పెళ్లెప్పుడు'.. ఎందుకు మీరు వస్తారా?

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు