ఫలించిన ఫ్యాన్స్‌ ఎదురుచూపులు.. కళ్లు చెదిరే రీతిలో.. రొనాల్డోకు కాసుల పంట

31 Dec, 2022 15:10 IST|Sakshi

పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డోకు బంపరాఫర్‌ తగిలింది. ఫిఫా వరల్డ్‌కప్‌కు ముందే మాంచెస్టర్‌ యునైటెడ్‌తో తెగదెంపులు చేసుకున్న రొనాల్డో అప్పటినుంచి ఏ క్లబ్‌కు సంతకం చేయలేదు. తాజాగా ఆ ఎదురుచూపులకు  రొనాల్డో తెరదించాడు. ఇకనుంచి రొనాల్డో సౌదీ అరేబియాకు చెందిన  అల్ నజర్ క్లబ్‌ తరఫున ఆడనున్నాడు. ఈ మేరకు  అల్ నజర్ ఫుట్‌బాల్ క్లబ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది.  

2023 సీజన్ నుంచి 2025 జూన్ వరకూ  (రెండేండ్లు)   రొనాల్డో.. అల్ నజర్ తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ డీల్ విలువ  200 మిలియన్ యూరోలకు పైగా ఉందని సమాచారం. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.1770 కోట్లు. ఫిఫా ప్రపంచకప్ సందర్భంలో ఇదే డీల్ పై పలు రకాల కథనాలు వినిపించాయి.  అప్పుడు రొనాల్డో వీటిని కొట్టిపారేసాడు. తాను ఎవరితో ఒప్పందం కుదుర్చుకోలేదని  చెప్పాడు. కానీ ఇప్పుడు భారీ డీల్‌తో ప్రేక్షకుల ముందు రావడం గమనార్హం.    

ఇక ఫిఫా ప్రపంచకప్‌లోనూ రొనాల్డో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కెప్టెన్‌గా పోర్చుగల్‌ను ఫైనల్‌ చేరుస్తాడనుకుంటే క్వార్టర్స్‌కే పరిమితమయ్యాడు. అంతేగాక ఈ ఫిఫా వరల్డ్‌కప్‌లో ఐదు మ్యాచ్‌లాడిన రొనాల్డో కేవలం ఒకే ఒక్క గోల్‌ చేసి తీవ్రంగా నిరాశపరిచాడు.అంతకముందు ఫిఫా ప్రారంభానికి ముందు పియర్స్‌ మోర్గాన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాంచెస్టర్‌ యునైటెడ్‌తో తెగదెంపులు చేసుకున్నాడు. అదీగాక మాంచెస్టర్‌ యునైటెడ్‌ హెడ్ కోచ్ తో గొడవ  ఈ వివాదం మరింత ముదిరేలా చేసింది.

చదవండి: Pele: భారత్‌తో అనుబంధం... నాడు సాకర్‌ మేనియాలో తడిసిముద్దయిన నగరం

పీలే క్రేజ్‌కు ఉదాహరణ.. షూ లేస్‌ కట్టుకున్నందుకు రూ.కోటి

మరిన్ని వార్తలు