Cristiano Ronaldo: మరో 7 గోల్స్‌ చేస్తే ప్రపంచ రికార్డు

22 May, 2021 08:03 IST|Sakshi

లిస్బన్‌: ప్రతిష్టాత్మక ‘యూరో కప్‌’ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు స్టార్‌ ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలో 26 మంది సభ్యులతో కూడిన పోర్చుగల్‌ జట్టు బరిలోకి దిగనుంది. యూరప్‌లోని 11 వేదికల్లో 24 జట్ల మధ్య జూన్‌ 11 నుంచి జూలై 11 వరకు ఈ టోర్నీ జరగనుంది. రొనాల్డో కెప్టెన్సీలోనే పోర్చుగల్‌ జట్టు 2016లో తొలిసారి ‘యూరో’ చాంపియన్‌గా అవతరించింది.

36 ఏళ్ల రొనాల్డోకిది వరుసగా ఆరో ‘యూరో’ చాంపియన్‌షిప్‌ కావడం విశేషం. రొనాల్డో మరో ఏడు గోల్స్‌ చేస్తే అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఒక దేశం తరఫున అత్యధిక గోల్స్‌ చేసిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఇరాన్‌ మాజీ ప్లేయర్‌ అలీ దాయి (109 గోల్స్‌) పేరిట ఉంది. ఈసారి పోర్చుగల్‌ జట్టుకు క్లిష్టమైన ‘డ్రా’ ఎదురైంది. గ్రూప్‌ ‘ఎఫ్‌’లో ప్రపంచ చాంపియన్‌ ఫ్రాన్స్, మాజీ విశ్వవిజేత జర్మనీ, హంగేరిలతో పోర్చు గల్‌ ఆడనుంది. ఈనెల 27న ‘యూరో’ కోసం పోర్చుగల్‌ సన్నాహాలు మొదలుపెట్టనుంది.  

చదవండి: French Open: మరో స్టార్‌ ప్లేయర్‌ దూరం 

మరిన్ని వార్తలు