Sunrisers Eastern Cape: జట్టు పేరు, ఇద్దరు ఆటగాళ్ల పేర్లు వెల్లడించిన సన్‌రైజర్స్‌! మార్కరమ్‌తో పాటు..

17 Aug, 2022 14:21 IST|Sakshi
ఎయిడెన్‌ మార్కరమ్‌ (PC: IPL/BCCI)

South Africa T20 League- Sunrisers Eastern Cape: సౌతాఫ్రికా టీ20 లీగ్‌తో ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌ క్రికెట్‌ మార్కెట్లో అడుగుపెడుతోంది. దక్షిణాఫ్రికా వేదికగా వచ్చే ఏడాది ఈ లీగ్‌ ఆరంభం కానుంది. ఇందులో పాల్గొనబోయే ఆరు ఫ్రాంఛైజీలలో ఒకటైన పోర్ట్‌ ఎలిజబెత్‌ను సన్‌రైజర్స్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. 

ఈ క్రమంలో తమ జట్టుకు సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌ కేప్‌గా నామకరణం చేసింది. అదే విధంగా వేలం కంటే ముందే తాము ఒప్పందం కుదుర్చుకున్న ఇద్దరు ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది. దక్షిణాఫ్రికా టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ ఎయిడెన్‌ మార్కరమ్‌తో పాటు డెత్‌ఓవర్ల బౌలింగ్‌ స్పెషలిస్టు ఒట్‌నీల్‌ బార్టమన్‌(అన్‌క్యాప్డ్‌)ను సొంతం చేసుకున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటన చేసింది. 

హైదరాబాద్‌ తరఫున
ఎయిడెన్‌ మార్కరమ్‌ ఐపీఎల్‌లో ఇప్పటికే సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌-2022తో జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అతడు తాజా ఎడిషన్‌లో 381 పరుగులు చేశాడు. ఇక టీ20 ప్రపంచకప్‌-2021 నుంచి దక్షిణాఫ్రికా తరఫున ఇప్పటి వరకు నాలుగు అర్ధ శతకాలు బాదాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. 

డెత్‌ఓవర్ల స్పెషలిస్టు
ఇక ఒట్‌నీల్‌ విషయానికొస్తే.. 29 ఏళ్ల ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు రైట్‌ ఆర్మ్‌ పేసర్‌గా రాణిస్తున్నాడు. సీఎస్‌ఏ ప్రొవిన్షియల్‌ టీ20 కప్‌ టోర్నీలో నార్తర్న్‌ కేప్‌నకు ప్రాతినిథ్యం వహించాడు. డెత్‌ఓవర్ల స్పెషలిస్టుగా అతడికి పేరుంది. ఇప్పటి వరకు 35 టీ20 మ్యాచ్‌లు ఆడిన అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌.. 41 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

స్వదేశంలో గతేడాది పాకిస్తాన్‌తో సిరీస్‌ సందర్భంగా జట్టుకు ఎంపికైనప్పటికీ అనారోగ్య కారణాల వల్ల దురదృష్టవశాత్తూ జట్టుకు దూరమయ్యాడు. కాగా దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌ నిబంధనల ప్రకారం వేలం కంటే ముందే ఆరు జట్లు ఐదుగురు ఆటగాళ్లతో ఒప్పందం కుదుర్చుకోవచ్చు. ఇందులో ఒకరు దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ఆడుతున్న క్రికెటర్‌, మరొకరు ప్రొటిస్‌ అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ ఉండాలి.

చదవండి: MS Dhoni: ఆ అవకాశమే లేదు! ఒకవేళ అదే ముఖ్యమైతే.. బీసీసీఐతో బంధాలన్నీ తెంచుకున్న తర్వాతే!
CSA T20 League: జట్టు పేరును వెల్లడించిన రాయల్స్‌ గ్రూప్‌.. బట్లర్‌ సహా..
MI Capetown: ఐదుగురు ఆటగాళ్ల పేర్లను ప్రకటించిన ఎంఐ కేప్‌టౌన్‌.. రబడ సహా..

A post shared by Sunrisers Eastern Cape (@sunrisersec)

మరిన్ని వార్తలు