ధోని తర్వాత సీఎస్‌కేకు కెప్టెన్‌ అయ్యేది ఆ ఆటగాడే!

12 Dec, 2021 12:18 IST|Sakshi
Courtesy: IPL

CSK Next Captain Ruturaj Gaikwad After MS Dhoni: రుతురాజ్‌  గైక్వాడ్‌ ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. దేశవాలీ టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో వరుస సెంచరీలతో దుమ్మురేపుతున్నాడు. ఇప్పటికే హాట్రిక్‌ సెంచరీలు బాదిన రుతురాజ్‌.. అటు కెప్టెన్‌గానూ మహారాష్ట్రను విజయవంతంగా నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సీఎస్‌కే ఫ్యాన్స్‌ రుతురాజ్‌ ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేస్తూ ధోని తర్వాత కెప్టెన్‌గా రుతురాజ్‌ సరైనోడని అభిప్రాయపడుతున్నారు. 

చదవండి: రుతురాజ్‌ హ్యాట్రిక్‌ సెంచరీ.. దుమ్మురేపుతున్న మహారాష్ట్ర

''రుతురాజ్‌ గైక్వాడ్‌ ఐపీఎల్‌ ఫామ్‌ను కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ధోని బాయ్‌ తర్వాత సీఎస్‌కేకు రుతురాజ్‌ కెప్టెన్‌ అయితే బాగుంటుంది.. మహారాష్ట్రను విజయవంతంగా నడుపుతున్న రుతురాజ్‌.. సీఎస్‌కేకు కెప్టెన్‌గా వ్యవహరిస్తే అదే ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. సౌతాఫ్రికా టూర్‌కు రుతురాజ్‌ను ఎంపికచేస్తే చూడాలనుంది'' అంటూ కామెంట్స్‌ చేశారు.

విజయ్‌ హజారే ట్రోఫీలో ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 136, 154*, 124 పరుగులు చేసి 435 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక ఐపీఎల్‌ 2021 సీజన్‌లో రుతురాజ్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 16 మ్యాచ్‌లాడిన రుతురాజ్‌ 635 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ గెలవడంతో సీఎస్‌కే నాలుగో ఐపీఎల్‌ టైటిల్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 

చదవండి: BBL 2021: కొలిన్‌ మున్రో విధ్వంసం..బిగ్‌బాష్‌ లీగ్‌ చరిత్రలో 27వ సెంచరీ

మరిన్ని వార్తలు