ప్రముఖ నటితో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడి ప్రేమాయణం..?

16 May, 2021 18:14 IST|Sakshi

ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ప్రముఖ సీరియల్ నటితో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌ ‌చల్ చేస్తున్నాయి. మరాఠి బుల్లితెరపై పాపులర్‌ అయిన సయాలి సంజీవ్‌తో ఈ చెన్నై ఆటగాడు ప్రేమాయణం సాగిస్తున్నాడన్న విషయంపై నెట్టింట విస్తుృతంగా చర్చ నడుస్తోంది. జీ మరాఠిలో వచ్చే ‘కహ్‌ దియా పర్దేస్‌'‌‌తో ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న సయాలీ..'గౌరీ' తదితర సీరియళ్లతో మరింత పాపులర్‌ అయ్యింది. స్వతాహాగా మోడల్ అయిన సయాలీ.. పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా కూడా వ్యవహరిస్తోంది.

కాగా, ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రుతురాజ్‌, సయాలీ మధ్య జరిగిన సంభాషణ చూస్తే వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందన్న విషయం అర్థమవుతుందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. సయాలి తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసిన ఫొటోలపై తొలుత రుతురాజ్ స్పందిస్తూ.. "వావ్" అంటూ రిప్లై ఇచ్చాడు. దీనికి సయాలీ బదులిస్తూ.. లవ్ సింబల్స్‌తో ఉన్న ఏమోజీలతో రిప్లై ఇచ్చింది. దీంతో వీరి మధ్య ఏదో నడుసోందన్న వార్తలు గుప్పుమన్నాయి. సయాలి అందానికి రుతురాజ్ క్లీన్‌ బౌల్డయ్యాడంటూ నెట్టింట మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

అయితే, ఆ పుకార్లను రుతురాజ్ పరోక్షంగా ఖండించాడు. బౌలర్లు తప్ప తననెవరూ బౌల్డ్ చేయలేరని, ఈ విషయం అర్ధం కావాల్సిన వాళ్లకు అర్ధమవుతుందని మరాఠీలో కామెంట్ చేశాడు. దీంతో ఈ లవ్ రూమర్స్‌కు ఆదిలోనే బ్రేక్ పడినట్లైంది. రుతురాజ్‌ పైకి ఇలా స్పందిస్తున్నా లోపలో మాత్రం ఏదో నడుస్తోందని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే, మహారాష్ట్రకు చెందిన రుతురాజ్.. గత ఐపీఎల్‌ సీజన్‌లో సీఎస్‌కే తరఫున అరంగేట్రం చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ ఆరంభంలో కరోనా బారిన పడటంతో జట్టుకు దూరమైన రుతురాజ్‌.. సీజన్ ఎండింగ్‌లో వరుస హాఫ్ సెంచరీలతో అలరించాడు. ప్రస్తుత సీజన్‌లో మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన అతను.. 128.94 స్ట్రైక్‌ రేట్‌తో 196 పరుగులు సాధించాడు.
చదవండి: కోహ్లి 70 సెంచరీలు చేశాడు.. మరి నువ్యు..?
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు