భ‌జ్జీ.. ఎల్లో టీష‌ర్ట్ మిస్స‌వుతున్నాం

4 Sep, 2020 18:57 IST|Sakshi

దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజ‌న్ ఆరంభం కాక‌ముందే చెన్నై సూప‌ర్ కింగ్స్ దెబ్బ మీద దెబ్బ తింటుంది. దుబాయ్‌లో అడుగుపెట్టిన రెండు రోజుల‌కే 13 మందికి క‌రోనా సోక‌డం.. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో సురేశ్ రైనా ఐపీఎల్‌లో ఆడలేనంటూ స్వ‌దేశానికి ప‌య‌న‌మ‌వ్వ‌డం చూశాం. తాజాగా సీఎస్‌కే సీనియ‌ర్ ఆఫ్ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ కూడా ఐపీఎల్ 13వ సీజ‌న్‌కు అందుబాటులో ఉండ‌డం లేదంటూ బాంబ్ పేల్చాడు. దీంతో సీఎస్‌కే  ఒక ప్ర‌ధాన ఆట‌గాడి సేవ‌ల‌ను కోల్పోయిన‌ట్ట‌యింది.

'తల్లి అనారోగ్యం దృష్యా.. మ‌రికొన్ని వ్య‌క్తిగ‌త కార‌ణాల రిత్యా ఈ స‌మ‌యంలో నా కుటుంబంతో గ‌డ‌పాల‌నుకుంటున్నా. అందుకే లీగ్‌లో ఆడ‌టం లేదంటూ' త‌న ట్విట‌ర్ ద్వారా సీఎస్‌కేకు చేరవేశాడు. భ‌జ్జీ చేసిన ట్వీట్‌పై సీఎస్‌కే స్పందించింది. 'ఈ స‌మ‌యంలోనే దృడంగా ఉండాలి పులర‌వే.. ఈ ఏడాది ఎల్లో టీష‌ర్ట్‌లో నీ ద‌ర్శ‌నం లేక‌పోవ‌డం బాధాక‌రం.. భ‌జ్జీ నిన్ను మిస్స‌వుతున్నాం ' అంటూ ట్వీట్ చేసింది. ఇదే విష‌య‌మై సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వ‌నాథ‌న్ స్పందిస్తూ..  'వ్య‌క్తిగ‌త కార‌ణాల రిత్యా తాను ఐపీఎల్‌కు అందుబాటులో ఉండ‌డం లేదని హ‌ర్భ‌జ‌న్ మాకు స‌మాచారం అందించాడు. అత‌ని ప‌రిస్థితిని అర్థం చేసుకొని సీఎస్‌కే అత‌ని నిర్ణ‌యానికి మ‌ద్ద‌తిస్తుంది.  ఇలాంటి క‌ష్ట‌కాలంలో భ‌జ్జీ త‌న ఫ్యామిలీకి అండ‌గా నిల‌బ‌డాల్సిన అవ‌స‌రం ఉంది.. అందుకే అత‌ని నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నాం. 'అంటూ పేర్కొన్నాడు.

కాగా గతేడాది జ‌రిగిన వేలం పాట‌లో హ‌ర్భ‌జ‌న్‌ను బేస్ ప్రైజ్‌(రూ.2 కోట్లు)కు సీఎస్‌కే ద‌క్కించుకుంది. ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్యంత విజ‌య‌వంత‌మైన బౌల‌ర్‌గా పేరు పొందిన భ‌జ్జీ.. అన్ని సీజ‌న్లు క‌లిపి 150 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఐపీఎల్‌లో ల‌సిత్ మ‌లింగ‌(170), అమిత్ మిశ్రా(157) త‌ర్వాత అత్య‌ధిక వికెట్లు తీసిన మూడో బౌల‌ర్‌గా రికార్డు సాధించాడు. కాగా యూఏఈ వేదికగా ఐపీఎల్ 13వ సీజ‌న్‌ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు జరగనుంది. 

చదవండి :
ధోనితో వాట్సన్‌ బ్రేక్‌ఫాస్ట్‌.. 

సీఎస్‌కేకు మరో ఎదురుదెబ్బ!
చిన్నప్పుడు ఏమైనా స్ప్రింగులు మింగాడా

మరిన్ని వార్తలు