చెన్నైకి విజయం వరించేనా!

17 Oct, 2020 19:14 IST|Sakshi

షార్జా : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య షార్జా వేదికగా మ్యాచ్‌ జరగనుంది. కాగా టాస్‌ గెలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌ ఏంచుకుంది. ఈ సీజన్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తూ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగనుండగా.. మరోవైపు సన్‌రైజర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో విజయం సాధించిన చెన్నై జట్టు 6వ స్థానంలో కొనసాగుతుంది. తొలి అంచెలో సీఎస్‌కే, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 44 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఇక ఇరు జట్ల విషయానికి వస్తే సీఎస్‌కే.. ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే మరోసారి బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. వాట్సన్‌, రాయుడు, డుప్లెసిస్‌లతో టాప్‌ ఆర్డర్‌ పటిష్టంగా కనిపిస్తున్నా.. మిడిలార్డర్‌ మాత్రం మంచి ప్రదర్శన కనబరచలేకపోతుంది. బౌలింగ్‌ విభాగంలో బ్రావో, దీపక్‌ చాహర్‌, శార్థూల్‌ ఠాకూర్‌, ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్‌ కరన్‌లు ఉన్నారు.

కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో ఓపెనర్లతో పాటు శ్రేయాస్‌ అయ్యర్‌, మార్కస్‌ స్టోయినిస్‌, అజింక్యా రహానేలతో బ్యాటింగ్‌ విభాగం అత్యంత పటిష్టంగా ఉంది. ఇక బౌలింగ్‌ విభాగంలో కగిసో రబడ మంచి ఫామ్‌ కనబరుస్తుండగా.. స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ పరుగులు నియంత్రించడంతో పాటు కీలక వికెట్లు తీస్తున్నాడు. రిషబ్‌ పంత్‌ గాయంపై ఎటువంటి స్పష్టత లేకపోవడంతో అతను ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం లేదు. ప్రస్తుతం ఢిల్లీ ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు చెన్నై మూడు విజయాలతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు