Women World Cup 2022: సెమీస్‌ కూడా చేరలేదు.. హెడ్‌కోచ్‌ పదవికి రాజీనామా!

29 Mar, 2022 14:12 IST|Sakshi
PC: ICC

ICC Women World Cup 2022: ఐసీసీ మహిళా ప్రపంచకప్‌-2022 టోర్నీలో న్యూజిలాండ్‌ వైఫల్యం నేపథ్యంలో ఆ జట్టు హెడ్‌కోచ్‌ బాబ్‌ కార్టర్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వైట్‌ఫెర్న్స్ కనీసం సెమీ ఫైనల్‌ కూడా చేరకుండానే మెగా ఈవెంట్‌ నుంచి నిష్క్రమించడంతో తన పదవికి రాజీనామా చేశారు. కాగా వుమెన్‌ వరల్డ్‌కప్‌ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న న్యూజిలాండ్‌.. ఆడిన ఏడు మ్యాచ్‌లలో కేవలం మూడింట మాత్రమే విజయం సాధించింది.

ఈ నేపథ్యంలో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికే పరిమితమైంది. సోఫీ డివైన్‌ సారథ్యంలోని వైట్‌ఫెర్న్స్‌ సెమీస్‌ చేరకుండానే వెనుదిరిగింది. ఈ నేపథ్యంలో ఐసీసీ మెగా ఈవెంట్‌లో జట్టు పరాభవానికి బాధ్యత వహిస్తూ బాబ్‌ కార్టర్‌ తన హెడ్‌కోచ్‌ పదవి నుంచి వైదొలిగారు. ఓటమి బాధించిందని, తను శిక్షణలో తమ జట్టు పలు విభాగాల్లో మెరుగైందని పేర్కొన్నారు. కాగా కార్టర్‌ ఇకపై న్యూజిలాండ్‌ క్రికెట్‌(పురుషులు, మహిళలు)కు హై పర్ఫామెన్స్‌  కోచ్‌గా వ్యవహరించనున్నారు.

చదవండి: IPL 2022 GT Vs LSG: అతడొక సంచలనం; తను నన్ను అవుట్‌ చేశాడు, నేను గెలిచా.. కుటుంబం మొత్తం హ్యాపీ: హార్దిక్‌ పాండ్యా

>
మరిన్ని వార్తలు