Commonwealth Games 2022: భారత్‌ ఖాతాలో మరో పతకం.. గురురాజ పూజారి కాంస్యం 

30 Jul, 2022 19:25 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత్‌ సత్తా చాటుతుంది. రెండో రోజు భారత అథ్లెట్లు వెయిట్‌లిఫ్టింగ్‌లో రెండు పతకాలు సాధించారు. తొలుత పురుషుల 55 కేజీల విభాగంలో సంకేత్‌ సర్గార్‌ రజత పతకం సాధించగా.. తాజాగా 61 కేజీల (పురుషుల) విభాగంలో గురురాజ పుజారి కాంస్యం నెగ్గాడు.

గురురాజ మొత్తం 269 కేజీల బరువును (స్నాచ్‌లో 118 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 153 కేజీలు) ఎత్తి మూడో స్థానంలో నిలువగా.. మలేషియాకు చెందిన అజ్నిల్ బిన్ బిడిన్ మహ్మద్ 285 కేజీలు (127, 158) ఎత్తి స్వర్ణ పతకాన్ని.. పపువా న్యూ గినియాకు చెందిన మోరియా బారు 273 కేజీలు (121, 152) ఎత్తి  రజతం సాధించారు.

కాగా, గురురాజకు కామన్‌వెల్త్‌ క్రీడల్లో ఇది వరుసగా రెండో పతకం కావడం విశేషం. అతను 2018 గోల్డ్‌ కోస్ట్‌ క్రీడల్లో 56 కేజీల విభాగంలో రజత పతకం సాధించాడు. 


చదవండి: CWG 2022: బోణీ కొట్టిన భారత్‌.. వెయిట్‌ లిఫ్టింగ్‌లో తొలి పతకం

మరిన్ని వార్తలు