CWG 2022 IND VS ENG: మంధాన ఊచకోత.. టీ20ల్లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ నమోదు

6 Aug, 2022 17:21 IST|Sakshi

కామన్‌వెల్త్‌ క్రీడల్లో భాగంగా ఇంగ్లండ్‌ మహిళా క్రికెట్‌ జట్టుతో శనివారం జరిగిన సెమీఫైనల్లో టీమిండియా ఓపెనర్‌ స్మృతి మంధాన రెచ్చిపోయి ఆడింది. కేవలం 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాది టీ20ల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. అంతర్జాతీయ టీ20 నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఇదే వేగవంతమైన అర్ధశతకం. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా బ్యాటర్‌ మెగ్‌లాన్నింగ్‌ (27 బంతుల్లో) పేరిట ఉండేది. మంధాన తాజా ప్రదర్శనతో మెగ్‌లాన్నింగ్‌ రికార్డు బద్ధలైంది. ఈ మ్యాచ్‌లో మంధాన విధ్వంసం ధాటికి పటిష్టమైన ఇంగ్లండ్‌ బౌలింగ్‌ దళం వణికిపోయింది.

మంధాన మొత్తం 32 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసి టీమిండియా భారీ స్కోర్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌ (31 బంతుల్లో 44 నాటౌట్‌; 7 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నస్టానికి 164 పరుగులు చేసింది. షఫాలీ వర్మ (17 బంతుల్లో 15; 2 ఫోర్లు), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (20 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్‌), దీప్తి శర్మ (20 బంతుల్లో 22; 2 ఫోర్లు) ఓ మోస్తరు పరుగులు సాధించారు. ఇంగ్లీష్‌ బౌలర్లలో కెంప్‌ 2, బ్రంట్‌, సీవర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.  
చదవండి: 'కోహ్లికి బ్యాకప్‌ ఎవరన్నది సెలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలి'

  

మరిన్ని వార్తలు