Ind W Vs Aus W: కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. అర్ధసెంచరీతో చెలరేగిన హర్మన్‌ప్రీత్ కౌర్..!

29 Jul, 2022 17:34 IST|Sakshi

కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022లో భాగంగా ఆస్ట్రేలియా మహిళలతో జరుగుతోన్న తొలి మ్యాచ్‌లో భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ కౌర్ అర్ధసెంచరీతో చెలరేగింది. హర్మన్‌ప్రీత్ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఫలితంగా భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో హార్మాన్‌ ప్రీత్‌(52)తో పాటు ఓపెనర్‌ షఫాలీ వర్మ(48) పరుగులతో రాణించింది. ఇక టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత జట్టుకు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ తొలి వికెట్‌కు 24 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దూకుడుగా ఆడిన స్మృతి మంధాన(24) బ్రౌన్ బౌలింగ్‌లో తొలి వికెట్‌గా వెనుదిరిగింది.

అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన యస్తికా(9) రనౌట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరింది. ఆ తర్వాత ‍బ్యాటింగ్‌కు వచ్చిన హర్మన్‌ప్రీత్.. షఫాలీ వర్మతో కలిసి స్కోర్‌ బోర్డును చక్కదిద్దే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో 11 ఓవర్‌ వేసిన బ్రౌన్‌ బౌలింగ్‌లో భారత బ్యాటర్లు 17 పరుగులు రాబట్టారు. ఇక 48 పరుగులు సాధించి జోరు మీద ఉన్న షఫాలీ వర్మ జూనెసన్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరింది. ఇక జట్టు పూర్తి బాధ్యతను కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ తన భుజాలపై వేసుకుంది. ఓ వైపు వికెట్లు పడుతున్న హర్మన్‌ మాత్రం తన కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో జానెసన్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా..స్కాట్‌ రెండు వికెట్లు, బ్రౌన్‌ ఒక్క వికెట్‌ సాధించింది.
చదవండి: Rohit Sharma: ఒంటి చేత్తో మ్యాచ్‌ను లాగేయగలరు.. అందుకే: రోహిత్‌ శర్మ

మరిన్ని వార్తలు