CWG 2022: అదరగొట్టిన భారత మహిళల హాకీ జట్టు.. వరుసగా రెండో విజయం

31 Jul, 2022 11:12 IST|Sakshi

కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. పూల్‌-ఏలో భాగంగా వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ మహిళల జట్టు 3-1 తేడాతో ఘన విజయం అందుకుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ విజయంతో భారత మహిళల జట్టు ఆరు పాయింట్లతో పూల్‌-ఏలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. భారత్‌ తరపున వందనా కటారియా(ఆట 26, 48వ నిమిషం), గుర్జీత్‌ కౌర్‌(ఆట 28వ నిమిషం)లో గోల్స్‌ చేయగా.. వేల్స్‌ తరపున గ్జెన్నా హ్యూజెస్‌(ఆట 45వ నిమిషం) గోల్‌ చేసింది. ఇక భారత్‌ తమ తర్వాతి మ్యాచ్‌ ఆగస్టు 2న ఇంగ్లండ్‌తో ఆడనుంది.

ఇక టోక్యో ఒలింపిక్స్‌లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికి భారత మహిళల జట్టు నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం చేజార్చుకుంది. కానీ ఈసారి ఎలాగైనా పతకం సాధించాలనే దృడ సంకల్పంతో ఉంది. మరోవైపు ఎలాగైనా స్వర్ణం సాధించాలని బరిలోకి దిగన భారత పురుషుల హాకీ జట్టు ఇవాళ ఘనాతో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల జట్టు కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు