Emma McKeon: కామన్‌వెల్త్‌ క్రీడల్లో సంచలనం.. 12 స్వర్ణాలు సాధించిన ఆసీస్‌ స్విమ్మర్‌

2 Aug, 2022 16:24 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న 22వ కామన్‌వెల్త్‌ క్రీడల్లో సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియా స్విమ్మర్‌ ఎమ్మా మెక్‌కియోన్‌ మహిళల 50 మీటర్ల ఫ్రీస్టైల్‌ విభాగంలో బంగారు పతకం గెలవడం ద్వారా కామన్‌వెల్త్‌ క్రీడల చరిత్రలో అత్యంత విజయవంతమైన అథ్లెట్‌గా అవతరించింది. బర్మింగ్‌హామ్‌లో ఇప్పటికే 4 గోల్డ్‌ మెడల్స్‌ (మిక్స్‌డ్ 4*100 ఫ్రీస్టైల్, 4*100 ఫ్రీస్టైల్, 50 ఫ్రీస్టైల్, 50 బటర్‌ఫ్లై‌) సాధించిన ఎమ్మా​.. గత రెండు కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో 8 పతకాలు సాధించి, ఈ క్రీడల చరిత్రలో అత్యధిక గోల్డ్‌ మెడల్స్‌ సాధించిన అథ్లెట్‌గా రికార్డుల్లోకెక్కింది.

గతంలో ఆస్ట్రేలియాకే చెందిన ఇయాన్ థోర్ప్, సూసీ ఓ నీల్, లీసెల్ జోన్స్‌లు తలో 10 బంగారు పతకాలు సాధించారు. తాజాగా ఎమ్మా వీరి పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టి కామన్‌వెల్త్‌ ఆల్‌టైమ్‌ బెస్ట్‌ అథ్లెట్‌గా రికార్డల్లోకెక్కింది. 2014 గ్లాస్గో క్రీడల్లో అరంగేట్రం చేసిన ఎమ్మా ఇప్పటివరకు మొత్తం 17 పతకాలు సాధించింది. ఇందులో 12 స్వర్ణాలు, రజతం, 4 కాంస్యాలు ఉన్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు సాధించిన ఎమ్మా.. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ లక్ష్యంగా దూసుకుపోతుంది. 
చదవండి: CWG 2022: ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ ధర తెలిస్తే షాకవ్వడం ఖాయం!

మరిన్ని వార్తలు