కోహ్లిని ఔట్‌ చేయాలంటే ఇలా చేయాల్సిందే: స్టెయిన్‌

19 Jun, 2021 16:23 IST|Sakshi

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ప్రారంభమైంది. అటు మాజీ ఆటగాళ్లు ఈ ప్రతిషష్టాత్మక పోరులో పాల్గొంటున్న ఇరు దేశాల బలా,బలహీనతలపై విశ్లేషిస్తూ వారి అనుభవాలను వెల్లడిస్తున్నారు. తాజాగా సౌతాఫ్రికా మాజీ స్పీడ్‌స్టర్‌ డేల్‌ స్టెయిన్‌ భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా స్టెయిన్‌ మాట్లాడుతూ.. కోహ్లిని ఔట్‌ చేయాలంటే అంత సులువు కాదని కచ్చితమైన ప్రణాళిక అవసరమని తెలిపాడు. గతంలో వీరిద్దరు ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ తరపున కలిసి ఆడారు.

వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ లాంటి ప్రతిష్టాత్మకమైన మ్యాచ్‌లో కోహ్లిలాంటి  ఆటగాడిని త్వరగా ఔట్‌ చేయకపోతే మ్యాచ్‌ విజయంపై అవకాశాలు తగ్గుతాయని స్టెయిన్‌ సూచించారు. కాగా  కోహ్లిని ఔట్‌ చేయాలంటే మైండ్‌గేమ్స్‌ తప్పవని తెలిపాడు. కచ్చితంగా మైండ్‌గేమ్స్‌ ఆడాల్సిందేనని పేర్కొంటూ.. నేను షార్ట్‌లెగ్‌లో ఒక ఫీల్డర్‌ను పెట్టేందుకు చూసే వాడిని, అలాగే బంతులను అతని శరీరానికి, ప్యాడ్లకు గురిపెట్టి వేసేవాడిని. అదే క్రమంలో బంతులు వేగంగా విసురుతానని అతడికి తెలిసేలా చేసేవాడిని. ఎందుకంటే ఏ బ్యాట్స్‌మెన్‌ అయినా తొలి 15 -20 బంతులును ఎదుర్కోవడంలో ఇబ్బంది పడతారని కనుక ఆ సమయంలో వికెట్‌ కోసం ప్రయత్నించాలని అని స్టెయిన్ అన్నారు. 

చదవండి: క్రికెట్‌ను ఆటగా కాకుండా మతంలా మార్చిన ఆ ఇన్నింగ్స్‌కు 38 ఏళ్లు..


 

మరిన్ని వార్తలు