BBL 2021-22: ఫైనల్‌ మ్యాచ్‌ ఆడేందుకు కరోనా లేని ఆటగాళ్లు కావాలి.. వస్తే ఫ్రీ బీర్‌

27 Jan, 2022 13:20 IST|Sakshi

బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌ 11వ సీజన్‌) చివరి అంకానికి చేరుకుంది. శుక్రవారం పెర్త్‌ స్కార్చర్స్‌, సిడ్నీ సిక్సర్స్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. అయితే సిడ్నీ సిక్సర్స్‌కు పెద్ద కష్టం వచ్చి పడింది. ఆ జట్టులోని ఆటగాళ్లు వరుసగా కోవిడ్‌ బారిన పడడంతో.. ఫైనల్‌ మ్యాచ్‌కు నిఖార్సైన 11 మంది ఆటగాళ్లు కరువయ్యారు. బుధవారం అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ తో జరిగిన ప్లేఆఫ్‌కు ఒక ఆటగాడు తక్కువ కావడంతో అసిస్టెంట్‌ కోచ్‌గా ఉన్న జే లెంటెన్‌ను తుది జట్టులో ఆడించింది. అయితే మొయిసిస్‌ హెన్రిక్స్‌ సారధ్యంలోని సిడ్నీ సిక్సర్స్‌ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి.. పెర్త్‌ స్కార్చర్స్‌తో తుదిపోరుకు సిద్ధమైంది.

చదవండి: BBL 2021-22: మ్యాచ్‌ గెలిచి ఫైనల్‌కు.. ఆఖరి బంతికి డ్రామాలేంటి?!

ఈ సందర్భంగా సిడ్నీ సిక్సర్స్‌ ఆటగాడు డేనియల్‌ క్రిస్టియన్‌ ఒక  ఫన్నీ ట్వీట్‌ చేశాడు.'' పెర్త్‌ స్కార్చర్స్‌తో శుక్రవారం బీబీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడబోతున్నాం. మా జట్టులో కొందరు కరోనా బారిన పడ్డారు. దీంతో ఫైనల్‌కు సరైన ఆటగాళ్లు లేరు.. మాకు కరోనా లేని ఆటగాళ్లు ఫైనల్‌ ఆడేందుకు కావాలి.. వస్తే వారికి ఫ్రీగా బీర్‌ కొనిపెడతా. మార్వెల్‌ స్టేడియంలో గురువారం సాయంత్రం 6:30 గంటలకు మా వార్మప్‌ ప్రారంభమవుతుంది. ఈలోపు వస్తే జట్టులో చోటుతో పాటు కప్‌ గెలిచిన తర్వాత ఫ్రీ బీర్‌ తాగొచ్చు. కానీ ఒక కండీషన్‌.. టెస్టు క్రికెటర్లకు మాత్రం చాన్స్‌ లేదు'' అంటూ  ట్వీట్‌ చేశాడు.

డేనియల్‌ క్రిస్టియన్‌ ఫన్నీ ట్వీట్‌కు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌, ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌లు స్పందించారు. ''ఫైనల్‌ ఆడేందుకు నేను సిద్ధం.. కానీ బౌలింగ్‌లో 4 ఓవర్ల కోటా బౌలింగ్‌కు గ్యారంటీ ఇస్తానంటేనే..'' అంటూ డివిలియర్స్‌ పేర్కొన్నాడు. '' సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్‌గా ఆడేందుకు కూడా రెడీ.. కానీ మీకు ఆల్రేడీ ఉన్న సబ్‌స్టిట్యూట్‌లకు డబ్బులు చెల్లించాలేమో'' అంటూ ఆర్చర్‌ రీట్వీట్‌ చేశాడు.

చదవండి: Racial Discrimination: ఆ క్లబ్‌లో నల్లజాతి క్రికెటర్లకు చోటు లేదా? ఇదేం వివక్ష

ఇక డిపెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్‌ టోర్నీ ఆరంభం నుంచి అదరగొట్టింది. వరుసగా మూడోసారి ఫైనల్లో అడుగపెట్టింది. ఇప్పటికే మూడుసార్లు బీబీఎల్‌ టైటిల్‌(2011, 2020,2021) దక్కించుకున్న సిడ్నీ సిక్సర్స్‌.. తాజాగా నాలుగో టైటిల్‌పై కన్నేసింది. 

మరిన్ని వార్తలు