IPL 2022: ఆర్‌సీబీ కెప్టెన్‌ అయ్యేది ఆ ఆటగాడే.. కానీ

1 Dec, 2021 20:08 IST|Sakshi
Courtesy: IPL

Daniel Vettori Picks His RCB Captain for IPL 2022: 2021 ఐపీఎల్‌ సీజన్‌ తర్వాత కోహ్లి ఆర్‌సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక వచ్చే సీజన్‌ నుంచి కోహ్లి ఆటగాడిగా మాత్రమే కొనసాగునున్నాడు. ఇక ఆర్‌సీబీకి తర్వాతి కెప్టెన్‌ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆర్‌సీబీ మాజీ ఆటగాడు.. కోచ్‌ డేనియల్‌ వెటోరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

చదవండి: Joshua da Silva Vs Dhananjaya de Silva: వార్నీ.. ప్రతీకారం ఇలా కూడా తీర్చుకుంటారా!

''కోహ్లి స్థానంలో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌  కెప్టెన్‌ అయ్యే అవకాశాలున్నాయి. ఐపీఎల్‌ 2021 సీజన్‌లో బ్యాట్స్‌మన్‌గా మ్యాక్సీ దుమ్మురేపాడు. ఒకే సీజన్‌లో ఆర్‌సీబీ తరపున 500కు పైగా పరుగులు సాధించాడు. అందుకే రిటైన్‌ లిస్ట్‌లో మ్యాక్స్‌వెల్‌ను తమతోనే అట్టిపెట్టుకుంది. దీంతో మ్యాక్స్‌వెల్‌ కెప్టెన్‌ అయ్యే చాన్స్‌ ఉంది. దీనికి ఒక కారణం ఉంది. బిగ్‌బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు మ్యాక్స్‌వెల్‌ నాయకత్వం వహించిన అనుభవం ఉంది. అతని కెప్టెన్సీలో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ 62 62 మ్యాచ్‌ల్లో 34 విజయాలు సాధించింది. కాకపోతే  ఆర్‌సీబీ అతన్ని ఒక సీజన్‌కు కెప్టెన్‌గా నియమించే అవకాశముంది. వచ్చే సీజన్‌లో అతని నాయకత్వంలో జట్టు ప్రదర్శన బాగుంటే భవిష్యత్తులో ఎక్కువకాలం కెప్టెన్‌గా కొనసాగే అవకాశం ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా ఐపీఎల్‌ 2022 మెగా వేలానికి ముందు 8 జట్ల ఫ్రాంచైజీలు రిటైన్‌ లిస్ట్‌ను విడుదల చేశాయి. ఇక ఆర్‌సీబీ విషయానికి వస్తే.. విరాట్‌ కోహ్లి, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మహ్మద్ సిరాజ్‌ను రీటైన్‌ చేసుకుంది. విరాట్‌ కోహ్లికి అత్యధికంగా 15 కోట్లు వెచ్చించగా..  గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌కు రూ.11 కోట్లు, మహ్మద్ సిరాజ్‌కు రూ. 7 కోట్లు వెచ్చించారు.

చదవండి: Virat Kohli: ఆర్‌సీబీ రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్లు వీరే.. కోహ్లికు ఎన్ని కోట్లంటే..

మరిన్ని వార్తలు