Virat Kohli: కోహ్లి బీసీసీఐకి సీక్రెట్‌ లెటర్లు రాశాడన్న ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

14 Sep, 2021 14:08 IST|Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ గోవర్‌ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐదో టెస్టు రద్దు విషయమై కోహ్లి మ్యాచ్‌ ముందురోజు అర్థరాత్రే  బీసీసీకి లేఖలు రాశాడంటూ ఆరోపణలు చేశాడు. ఈ విషయం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. క్రికెట్‌ డాట్‌కామ్‌తో జరిగిన ఇంటర్య్వూలో గోవర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. 

''ఐదో టెస్టు రద్దు చేయాలంటూ కోహ్లి బీసీసీఐకి లేఖలు రాసిన మాట వాస్తవం. కరోనా కారణంగా మ్యాచ్‌ను నిలిపివేయాలన్నది అవాస్తవం. సాధారణంగా మ్యాచ్‌కు ముందు కఠిన పరిస్థితులు ఉంటే తప్ప రద్దు అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఐదో టెస్టుకు ముందు ఆటగాళ్లందరికి నిర్వహించిన ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులో నెగెటివ్‌ వచ్చిందన్న విషయం కోహ్లి మర్చిపోయాడు. కేవలం ఐపీఎల్‌ను దృష్టిలో పెట్టుకొనే కోహ్లి ఈ విధంగా వ్యవహరించాడు.

ఒకవేళ మ్యాచ్‌ రద్దుకు ఐపీఎల్‌ అనే సాకుతో కోహ్లి ఇలా చేశాడంటే మాత్రం అది పెద్ద తప్పే అవుతుంది. ఎందుకంటే ఇదే కోహ్లి గతంలో ఇంగ్లండ్‌ పర్యటనకు వచ్చినప్పుడు టెస్టు క్రికెట్‌ అంటే తనకు ఎంతో ప్రాణమని.. నా మొదటి ప్రాధాన్యత టెస్టులకే ఇస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'' అంటూ తెలిపాడు. 

చదవండి: Ind Vs Eng: అదనంగా రెండు టీ20లు, టెస్టు ఆడేందుకు రెడీ: జై షా


అంతకముందు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఐదో టెస్టు రద్దుపై ఆర్‌సీబీ నిర్వహించిన బోల్డ్‌ డైరీస్‌ ఇంటర్య్వూలో స్పందించాడు. ''ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ఆగిపోవడం కొంచెం బాధ కలిగించింది. కరోనా కారణంగానే ఐదో టెస్టును రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అంతేగాక తక్కువ వ్యవధిలోనే మేం రెండు పెద్ద టోర్నీల్లో పాల్గొనాల్సి ఉంది. మొదట ఐపీఎల్‌ 14వ సీజన్‌ సెకండ్‌ ఫేజ్‌ పోటీలు.. ఆ తర్వాత ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్‌. ఒకవేళ ఐదో టెస్టు మ్యాచ్‌ ఆడిన తర్వాత ఎవరైన ఆటగాళ్లు కరోనా బారిన పడితే అది మా జట్టుకే నష్టం. తక్కువ వ్యవధిలో క్వారంటైన్‌ గడపడం కూడా కష్టమే. అందుకే ముందే అప్రమత్తమైతే బాగుంటుందని ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక కెప్టెన్‌గా ఆర్‌సీబీని గెలిపించడం.. ఆ తర్వాత టీమిండియా కెప్టెన్‌గా జట్టును నడిపించడం ముఖ్యమని భావిస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు.


ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఐదో టెస్టు మ్యాచ్‌ నిర్వహణపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం టెస్టు మ్యాచ్‌ నిర్వహించే సమయం లేకపోవడంతో ఈసీబీ దానిని ఐకైక టెస్టు మ్యాచ్‌గా వచ్చే ఏడాది నిర్వహిస్తామని తెలిపింది. దీనికి బీసీసీఐ ఒప్పుకోవడం లేదు. సౌరవ్‌ గంగూలీ మాత్రం ఇదే టెస్టు సిరీస్‌ కిందనే ఐదో మ్యాచ్‌ను రీషెడ్యూల్‌ చేస్తామని.. అలాగే ఆడదామని ప్రతిపాదించాడు.  దీంతో భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య రద్దయిన ఐదో టెస్టు వ్యవహారం ఐసీసీ వరకు చేరింది.

చదవండి:  కోహ్లి ప్రతిపాదనను తిరస్కరించిన ఈసీబీ.. 22న యూకేకు గంగూలీ!

మరిన్ని వార్తలు