David Miller IPL 2021 2nd Phase: 'నీకు హిందీ వచ్చా' అంటూ ప్రశ్న.. డేవిడ్‌ మిల్లర్‌ కౌంటర్‌

14 Sep, 2021 11:29 IST|Sakshi

కొలంబొ: ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో అంచె పోటీలకు వారం సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే లీగ్‌లో పాల్గొననున్న విదేశీ ఆటగాళ్లంతా యూఏఈకి చేరుకుంటున్నారు. ఈసారి అభిమానుల కోలాహలంతో మైదానాలు హోరెత్తనున్నాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికా సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మిల్లర్‌.. ఒక అభిమాని వేసిన చిలిపి ప్రశ్నకు ధీటుగా కౌంటర్‌ ఇచ్చాడు. మిల్లర్‌ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మిల్లర్‌ ఆ జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ దిశాంత్‌ యగ్నిక్‌ ట్విటర్‌లో వేసిన ప్రశ్నకు తనదైన శైలిలో మీమ్‌ క్రియేట్‌ చేశాడు.

చదవండి: IPL 2021 Phase 2: ఇయాన్‌ మోర్గాన్‌ నా గురించి ఏమనుకుంటున్నాడో..

మిల్లర్‌ను ఉద్దేశించి దిశాంత్‌.. ''మీరు రాజస్తాన్‌ రాయల్స్‌ అడ్మిన్‌ ఎవరో చూడాలనుకుంటున్నారా?'' అని అడిగాడు. దీనికి బదులుగా మిల్లర్‌.. కబీ ఖుషి కబీ గమ్‌ సినిమాలోని ఫేమస్‌ డైలాగ్‌ ''బస్‌ కీజియే బహుత్‌ హో గయా''( ఇక చాలు.. ఇక్కడితో ఆపేయ్‌) అని పెట్టాడు. మిల్లర్‌ పెట్టిన మీమ్‌పై ఒక అభిమాని చిలిపి ప్రశ్న వేశాడు. ''నీకసలు హిందీ వచ్చా? అని అడిగాడు. ''ఇట్టూ సా'' అంటూ  కామెడీ నైట్స్‌ విత్‌ కపిల్‌ షోలో అలీ సాగర్‌ పాపులర్‌ డైలాగ్‌ను పెట్టాడు. ఇట్టు సా అంటే '' నాకింతే వచ్చు'' అని అర్థం.

కాగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ మలిదశ పోటీలకు ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాళ్లు బెన్‌ స్టోక్స్‌, జాస్‌ బట్లర్‌ అందుబాటులో లేకపోవడంతో డేవిడ్‌ మిల్లర్‌ కీలకం కానున్నాడు. ఈ సీజన్‌లో మిల్లర్‌ 6 మ్యాచ్‌ల్లో 102 పరుగులు చేశాడు. ఇక సంజూ శాంసన్‌ ఆధ్వర్యంలోని రాజస్తాన్‌ రాయల్స్‌ ఈ సీజన్‌లో పడుతూ లేస్తూ వచ్చింది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు.. నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. 

చదవండి: IPL 2021 Second Phase: ఐపీఎల్‌లో నెట్‌ బౌలర్లుగా విండీస్ బౌలర్లు...

మరిన్ని వార్తలు