డేవిడ్‌ వార్నర్‌ @ 50-50

10 Oct, 2020 11:06 IST|Sakshi

ఢిల్లీ: ఐపీఎల్‌లో డేవిడ్‌ వార్నర్‌ 50 ఆఫ్‌ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొదటి వ్యక్తి అతడే. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌ (52) ఆఫ్‌ సెంచరీ చేయడం ద్వారా ఈ రికార్డు సాధించాడు. అంతేకాదు పంజాబ్‌తో ఆడిన గత తొమ్మిది మ్యాచుల్లో వార్నర్‌ ఆఫ్‌ సెంచరీ చేయడం విశేషం. కాగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ 69 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడు స్థానానికి చేరుకుంది. ఆఫ్‌ సెంచరీల జాబితాలో విరాట్‌ కోహ్లి (42), రోహిత్‌ శర్మ (39), రైనా (39), ఏబీ డివీలియర్స్‌ (38) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. హైదరాబాద్‌, పంజాబ్‌ మ్యాచ్‌ ద్వారా ఐపీఎల్‌ చరి​త్రలో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటో చూద్దామా...

* హైదరాబాద్‌ కెప్టెన్‌గా వార్నర్‌ పంజాబ్‌ జట్టుపై వరుసగా ఏడు విజయాలు సాధించాడు. ఐపీఎల్‌లో ఒక జట్టుపై ఈ ఘనత సాధించిన మొదటి కెప్టెన్‌ వార్నర్‌.  ఇంతకు ముందు సచిన్‌ టెండూల్కర్‌ ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా ఉన్నప్పుడు కోలకతాపై ఆరు విజయాలు సాధించాడు. పంజాబ్‌పై విజయంతో వార్నర్‌ ఆ రికార్డును బద్దలుకొట్టాడు.

 * ఒక ఐపీఎల్‌ జట్టుపై అత్యధిక ఆఫ్‌ సెంచరీలు (11) చేయడమే కాకుండా, వరుసగా తొమ్మిది ఆఫ్‌ సెంచరీలు చేసిన రికార్డు కూడా వార్నర్‌ సొంతమైంది. 

* 150+ పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యం రెండు సార్లు సాధించిన రికార్డు వార్నర్‌, జానీ బెయిర్‌స్టోకే దక్కుతుంది. 2019లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరు ఓపెనర్లుగా 185 పరుగులు చేశారు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 160 పరుగులు చేసి ఈ రికార్డు సాధించారు. 

* ఈ మ్యాచ్‌లో రషీద్‌ ఖాన్‌ కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఐపీఎల్‌లో 12, అంత కంటే తక్కువ పరుగులు నాలుగు మ్యాచుల్లో ఇచ్చిన రికార్డు రషీద్‌తో పాటు డేల్‌ స్టెయిన్‌ కూడా ఉన్నాడు. కానీ రషీద్‌ కేవలం 52 మ్యాచుల్లో ఈ ఘనత సాధించాడు. స్టెయిన్‌  రషీద్‌ కంటే 42 మ్యాచులు ఎక్కువగా ఆడాడు. 

* వరుస మ్యాచుల్లో 150+ పరుగులు ఓపెనర్లకు సమర్పించుకున్న జట్టుగా పంజాబ్‌ నిలించింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో షేన్‌ వాట్సన్‌, ఫాఫ్‌ డూప్లెసిస్‌ ఇద్దరూ వికెట్‌ కోల్పోకుండా 179 ఛేదించారు. 

(ఇదీ చదవండి: వార్నర్‌.. నీ డ్యాన్స్‌ వీడియోలు పెట్టు: యువీ)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు