వార్నర్‌ మళ్లీ మొదలుపెట్టాడు.. ఈసారి రౌడీ బేబీతో

19 May, 2021 19:06 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ మళ్లీ మొదలుపెట్టేశాడు.. అదేంటి వార్నర్‌ ఏం మొదలుపెట్టాడనేగా మీ డౌటు. అయితే ఈ వార్త చదివేయండి. కరోనా మహమ్మారి మొదటివేవ్‌లో లాక్‌డౌన్‌ సమయంలో వార్నర్‌ తన కుటుంబసభ్యులతో కలిసి చేసిన సందడి ఎవరు మరిచిపోలేరు. టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ ఇలా దేన్ని వదలకుండా తన డ్యాన్స్‌లు, డైలాగ్స్‌, మేనరిజమ్స్‌తో తన ఫ్యాన్స్‌ను అలరించాడు. అందునా ఇండియన్‌ సినిమాలంటే వార్నర్‌కు తెగ ఇష్టం.

ముఖ్యంగా సౌత్‌ సినిమాలపై ప్రేమ చూపించే వార్నర్‌ టాలీవుడ్‌ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి, మహేశ్‌ బాబు, అల్లు అర్జున్‌ లాంటి స్టార్‌ హీరోల సినిమాలతో పాటు తమిళ స్టార్‌ హీరో విజయ్‌ నటించిన సినిమాల నుంచి పాటలు.. డ్యాన్సులు.. డైలాగ్స్‌తో అనుకరించాడు. తాజాగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ రద్దు కావడంతో స్వదేశానికి చేరుకున్న వార్నర్‌ విరామం దొరకడంతో మరోసారి ఇండియన్‌ సినిమా పాటకు డ్యాన్స్‌ చేశాడు. ఈసారి తమిళ సూపర్‌స్టార్‌ ధనుష్‌ నటించిన మారి-2 సినిమాలోని రౌడీ బేబీ పాటను అనుకరించాడు. ధనుష్‌ స్థానంలో తన ఫేస్‌ను మార్ఫింగ్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోనే వార్నర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇక ఐపీఎల్‌ 14వ సీజన్‌ జరుగుతున్న సమయంలోనే డేవిడ్‌ వార్నర్‌ను కెప్టెన్సీ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. వార్నర్ స్థానంలో కేన్‌ విలియమ్స్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పింది. అయితే వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎల్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్లలో ఒకడిగా ఉన్న వార్నర్‌కు మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ ఎస్‌ఆర్‌హెచ్‌పై ట్రోల్స్‌, మీమ్స్‌తో రెచ్చిపోయారు. అయితే కరోనా మహమ్మారి సెగ ఐపీఎల్‌ను తాకడంతో లీగ్‌ రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించడంతో ఈ వివాదం సమసిపోయింది. అయితే వార్నర్‌ ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆడడం ఇదే చివరిసారి కావొచ్చు.. వచ్చే ఐపీఎల్‌లో వార్నర్‌ను వేలంలో దక్కించుకునేందుకు చాలా ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇక ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ దారుణ ప్రదర్శన కనబరిచింది. లీగ్‌ రద్దయ్యే సమయానికి 7 మ్యాచ్‌లాడి 6 ఓటములు.. ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.
చదవండి: 'నాన్న తొందరగా వచ్చేయ్‌.. నిన్ను మిస్సవుతున్నాం'

వైరల్‌: డ్రింక్స్‌ మోసుకెళ్లినా.. వి లవ్‌ యూ వార్నర్‌ అన్నా!

A post shared by David Warner (@davidwarner31)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు