IPL 2022: 51 పరుగుల దూరంలో వార్నర్‌.. తొలి విదేశీ ఆటగాడిగా!

7 Apr, 2022 15:00 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఐపీఎల్‌లో ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఓ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. గత కొన్ని సీజన్లగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన డేవిడ్‌ వార్నర్‌ ఈ ఏడాది సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నాడు. ఇక ఐపీఎల్‌-2022లో భాగంగా ఏప్రిల్ ‌7న లక్నో సూపర్‌జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనుంది.

ఈ మ్యాచ్‌లో డేవిడ్‌ వార్నర్‌ మరో 51 పరుగులు సాధిస్తే.. ఐపీఎల్‌లో 5500 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. కాగా ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 150 మ్యాచ్‌లు ఆడిన వార్నర్‌ 5449 పరుగులు సాధించాడు. ఓవరాల్‌గా చూస్తే తొలి స్థానంలో 6341 పరుగులతో టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఉన్నాడు. ఇక రెండో స్థానంలో 5876 పరుగులతో టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఉన్నాడు.
ఐపీఎల్‌లో ఐదు వేల పరుగులు సాధించిన ఆటగాళ్లు వీరే
విరాట్‌ కోహ్లి-5876 పరుగులు
శిఖర్‌ ధావన్‌-5665 పరుగులు
రోహిత్‌ శర్మ- 5565 పరుగులు 
సురేష్‌ రైనా -5528 పరుగులు
డేవిడ్‌ వార్నర్‌-5549 పరుగులు
ఏబీ డివిలియర్స్‌-5162 పరుగులు

చదవండి: IPL 2022: లక్నో సూపర్‌ జెయింట్స్‌కు భారీ షాక్‌.. విధ్వంసకర ఆటగాడు దూరం!

మరిన్ని వార్తలు