బాల్‌ ట్యాంపరింగ్‌పై వార్నర్‌ పుస్తకం! 

28 Oct, 2020 17:37 IST|Sakshi

మెల్‌బోర్న్‌ : క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)ను కుదిపేసిన 2018 బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంపై డాషింగ్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ పుస్తకం రాయనున్నట్లు అతని భార్య క్యాండిస్‌ వార్నర్‌ వెల్లడించింది. రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికా పర్యటనలో ఆసీస్‌ ఆటగాళ్లు స్మిత్‌ (అప్పటి కెప్టెన్‌), వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌ కేప్‌టౌన్‌ టెస్టులో బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడి నిషేధానికి గురయ్యారు. ఈ ఉదంతం ఆటగాళ్ల కెరీర్‌కు మచ్చగా నిలిచింది. అయితే దీనిపై వాస్తవాల్ని వివరించేందుకు తన భర్త పుస్తకం రాస్తాడని క్యాండిస్‌ తెలిపింది. బంతిని ఉద్దేశపూర్వకంగా మార్చాలనే ప్రణాళిక వార్నర్‌దేనన్న ఆరోపణల్ని ఆమె కొట్టిపారేసింది. అది వేరొకరి ప్రమేయంతో జరిగిందని చెప్పింది. వార్నర్‌ మేనేజర్‌ జేమ్స్‌ ఎర్క్‌సిన్‌ కూడా పుస్తకంలోనే అన్ని విషయాలు వెల్లడవుతాయని, తప్పకుండా వార్నర్‌ సమీప భవిష్యత్తులో వాస్తవాలతో పుస్తకం రాస్తాడని చెప్పారు.
(చదవండి : అతని ఆట నాకు ఆశ్చర్యం కలిగించింది)

సరిగ్గా రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆసీస్‌ ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, బాన్‌ క్రాఫ్ట్‌లు బాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలతో నిషేధం ఎదుర్కొన్నారు. ఈ వివాదంలో వార్నర్‌, స్మిత్‌లు ఏడాది పాటు నిషేధం ఎదుర్కోగా, బాన్‌ క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం పడింది. (చదవండి : 'కెరీర్‌ మొత్తం మానసిక క్షోభకు గురయ్యా')

మరిన్ని వార్తలు