Pak vs Aus: ఒకవైపు వార్న్‌ మరణం.. ఇప్పుడు ఇది అవసరమా వార్నర్‌ ?

6 Mar, 2022 08:19 IST|Sakshi

రావల్పిండి వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో పాకిస్తాన్‌ చెలరేగింది. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్‌  476/4 పరుగులు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. పాక్‌ బ్యాటర్లలో ఇమామ్‌ ఉల్‌ హఖ్‌(157), అజహర్‌ అలీ(185) పరుగులతో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో లయాన్‌, లబుషేన్‌, కమిన్స్‌ చెరో వికెట్‌ సాధించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా ఆసీస్‌ 5 పరుగులు చేసింది. క్రీజులో వార్నర్‌, ఖవాజా ఉన్నారు.  ఇక రెండో రోజు మ్యాచ్‌ జరగుతుండగా ఆసీస్‌ స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ డ్యాన్స్‌ చేస్తూ అభిమానులను ఉత్సాహపరిచాడు.

అంతేకాకుండా పుష్ప సినిమాలోని తగ్గేదే లే అంటూ డైలాగ్‌ను వార్నర్‌ చెప్పాడు. బౌండరీ లైన్‌ వద్ద వార్నర్‌ ఫీల్డింగ్‌ చేస్తుండగా.. అందరూ "వార్నర్ వార్నర్" అంటూ అరుస్తూ  అతనిపై అభిమానాన్ని చాటుకున్నారు. ఈ క్రమంలో వార్నర్  ప్రతిస్పందింస్తూ.. పంజాబీ సాంగ్‌ దేశీ 'తుమ్కా'కు స్టెప్పులేశాడు. ఇక వార్నర్‌ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వార్నర్‌కు ఇదేం కొత్త కాదు, అంతకుముందు పుష్ప సినిమాలోని శ్రీవల్లీ పాటకు,  ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా పాట‌కు తనదైన శైలిలో డ్యాన్స్ చేసి అభిమానులను అలరించాడు. 

వార్నర్‌ ఇప్పుడు ఇది అవసరమా?
మరోవైపు వార్నర్‌ డ్యాన్స్‌ చేయడంపై కొంతమంది అభిమానులు  విమర్శల వర్షం కురిపిస్తోన్నారు. దిగ్గజ క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ హఠాన్మరణం చెందితే వార్నర్‌కు ఇప్పుడు ఇది అవసరమా అని అభిమానులు ట్రోల్‌ చేస్తున్నారు. ఆసీస్‌కు ఎన్నో విజయాలు అందించిన వార్న్‌ ఆకస్మికం మరణంతో క్రికెట్‌ ఆస్ట్రేలియాతో(సీఏ)తో పాటు క్రికెట్‌ ప్రేమికులు కూడా ఒక్కసారిగా షాక్‌కు గురైన సంగతి తెలిసిందే.

చదవండి: INDW Vs PAKW: షఫాలీ వర్మ అవుట్.. తొలి వికెట్ కోల్పోయిన భారత్

మరిన్ని వార్తలు