'ఆర్ఆర్ఆర్' పోస్టర్‌ను మార్ఫింగ్‌ చేసిన డేవిడ్‌ భాయ్‌.. తారక్‌గా కేన్‌ మామ

29 Jun, 2021 21:24 IST|Sakshi

హైదరాబాద్‌: అతను బ్యాట్‌ పట్టి మైదానంలో అడుగుపెడితే బౌండరీలు చిన్నబోతాయి.. కెమెరా ముందుకు వస్తే సోషల్‌ మీడియాలో లైకుల లెక్కలు మిలియన్లు దాటేస్తాయి.. ఆసీస్‌ క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌గానైనా,  సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గానైనా పరుగుల వరద పారాల్సిందే.. అతడే ఆసీస్‌ ముద్దు బిడ్డ, సన్‌రైజర్స్‌ చిచ్చర పిడుగు డేవిడ్‌ వార్నర్‌. ఈ డైలాగ్‌ ఛాయలు ఎక్కడో తగులుతున్నట్టుగా ఉంది కదూ. రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని పాపులర్‌ డైలాగ్‌ ఇది. ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్‌ను ‘ఆర్ఆర్ఆర్’ టీం ఇటీవలే విడుదల చేసింది. అందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ బైక్‌పై వెళ్తుంటారు. అయితే, సహజంగానే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వార్నర్‌.. ఈ ఫోటోను ఆలస్యం చేయకుండా మార్ఫింగ్‌ చేసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు.

మార్ఫింగ్‌ ఫోటోలో బైక్ నడుపుతున్న ఎన్టీఆర్‌ తలకు బదులుగా తన సహచరుడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్ తలను తగిలించాడు. వెనక కూర్చున్న రామ్ చరణ్ తలకు బదులుగా తన ఫొటోను తగిలించాడు. యాస్‌ యూజ్యువల్‌గానే ఈ పోస్ట్‌కు కూడా విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చింది. క్షణల్లో వేల సంఖ్యలో లైకులు వచ్చిపడ్డాయి. ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులైతే కామెంట్లతో ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ఫొటోను చూసిన ఎస్ఆర్ఎస్ సహచరుడు రషీద్ ఖాన్ వెంటనే స్పందించాడు. ‘హెల్మెట్ గైస్’ అంటూ ట్రోల్ చేశాడు. కాగా, ఇదే ఫొటోకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా రషీద్ లానే స్పందించారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఫొటోలకు హెల్మెట్లు పెట్టి ఇప్పుడు సంపూర్ణంగా ఉందని ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్‌గా ఆర్ఆర్ఆర్ బృందం మరో ట్వీట్ చేస్తూ ఇది పరిపూర్ణంగా లేదని, నంబరు ప్లేట్ మిస్సయిందని గుర్తు చేశారు. మధ్యలో కల్పించుకున్న అభిమానులు ఆ బైక్‌కు హెడ్‌ లైట్ కూడా లేదని సరదా కామెంట్లతో హోరెత్తించారు.
చదవండి: Sachin Tendulkar: ఆ రికార్డుకు సరిగ్గా 14 ఏళ్లు.. నేటికీ చెక్కుచెదరలేదు
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు