అమ్మ బాబోయ్‌.. వార్నర్‌ మళ్లీ ఇరగదీశాడు

4 Jun, 2021 19:58 IST|Sakshi

సిడ్నీ: ఆసీస్‌ విధ్వంసకర క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియా అంటే విపరీతమైన అభిమానం చూపించే వార్నర్‌ పాటలు, డైలాగ్స్‌, డ్యాన్స్‌ వీడియోలతో అలరిస్తే వచ్చాడు. తాజాగా స్వాప్‌ వీడియోతో ముందుకు వచ్చిన వార్నర్‌ టైగర్‌ ష్రాప్‌ నటించిన స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ సినిమాలోని పాటకు స్టెప్పులేశాడు. స్వాపింగ్‌ యాప్‌తో టైగర్‌ ష్రాఫ్‌ ముఖానికి బదులుగా తన ముఖాన్ని స్వాప్‌ చేసి వీడియోను రిలీజ్‌ చేశాడు. ఇదంతా నా అభిమానుల డిమాండ్‌ మేరకే అంటూ వార్నర్‌ క్యాప్షన్‌ జతచేశాడు. ప్రస్తుతం వార్నర్‌ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. 

కాగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ కరోనా కారణంగా రద్దు కావడంతో స్వదేశానికి చేరుకున్న వార్నర్‌ 15రోజుల పాటు సిడ్నీలోని హోటల్లో కఠిన క్వారంటైన్‌లో గడిపాడు. ఇటీవలే ఐసోలేషన్‌ పూర్తి చేసుకున్న ఆటగాళ్లు తమ కుటుంబసభ్యులను కలుసుకున్నారు. సుధీర్ఘ విరామం తర్వాత తమ కుటుంభసభ్యులను కలుసుకోవడంతో ఆటగాళ్లంతా ఎమెషన్‌కు గురయ్యారు. ఇక ఆస్ట్రేలియా జూలైలో విండీస్‌లో పర్యటించనుంది. విండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌తో పాటు మూడు వన్డేలు ఆడనుంది.
చదవండి: 'నేను నిన్ను ప్రేమిస్తున్నా'.. నా భార్యకు ఏం అర్థం అయిందో!

A post shared by David Warner (@davidwarner31)
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు