కొడితే సిక్సే.. సింగిల్స్‌ అసలు తీయరేమో

9 Apr, 2021 20:04 IST|Sakshi

వాషింగ్టన్‌: జెంటిల్‌మెన్‌ గేమ్‌ క్రికెట్‌లో సింగిల్స్‌ను తిరస్కరించే రోజులు మరెంతో దూరంలో లేవని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్‌ ద్రవిడ్‌ వ్యాఖ్యానించారు. కొడితే సిక్సే కొట్టాలని బ్యాట్స్‌మెన్లు ఫిక్స్‌ అయ్యే రోజులు వస్తాయని, సింగిల్స్‌కు కాలం చెల్లే రోజులు దగ్గరలో ఉన్నాయని అభిప్రాయపడ్డారు. బ్యాట్‌కు బంతికి మధ్య జరిగే పోటీని గణాంకాలు నడిపించనున్నాయని జోస్యం చెప్పాడు. ఆటగాళ్ల ఎంపిక, వ్యూహరచనలను గణాంకాలు ఎంతగానో ప్రభావితం చేస్తాయని, బేస్‌బాల్‌ తరహాలో క్రికెట్‌లో సైతం గణాంకాలే కీలమని ఆయన పేర్కొన్నాడు. క్రికెట్‌లో గణాంకాలపై నిర్వహించిన సదస్సులో ద్రవిడ్‌తో పాటు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ గ్యారీ కిర్‌స్టన్‌, ఇంగ్లండ్ మహిళల జట్టు మాజీ క్రీడాకారిణి ఇషా గుహ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ద్రవిడ్‌ మాట్లాడుతూ.. ఆటగాళ్ల సాధన దగ్గర నుండి ఫిట్‌నెస్‌, బౌండరీలు, సిక్సర్లు లాంటి మరెన్నో అంశాల్లో డేటా చాలా ఉపయోగపడుతుందని వివరించాడు. బాస్కెట్‌ బాల్‌లోని 3 పాయింట్‌ రెవల్యూషన్‌ తరహాలోనే క్రికెట్‌లో కూడా డేటా ప్రయోజనాలుంటాయని స్పష్టం చేశారు. టీ20ల్లో ప్రతి బంతికీ ప్రాముఖ్యత ఉంటుందని, కొత్త కుర్రాళ్లు మెరుగైన సాంకేతికతను వినియోగించుకొని ప్రత్యర్థి బలాబలాలను విశ్లేషించుకొని మరీ ప్రతిదాడి చేస్తున్నారని, ఇందుకు వారు డేటాను బాగా వినియోగించుకుంటున్నారని ఇషా గుహ తెలిపారు. క్రీడల్లో సందిగ్ధం నెలకొనప్పుడు డేటా ఎలా ఉపయోగపడుతోందో అన్న అంశాన్ని గ్యారీ కిర్‌స్టెన్‌ వివరించారు.
చదవండి: ద్రవిడ్‌ను ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదు..

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు