టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ

24 Oct, 2020 15:08 IST|Sakshi

అబుదాబి: షైక్‌ జాయేద్‌ స్టేడియంలో కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఐపీఎల్‌ 2020 లో ఇప్పటివరకైతే కోల్‌కతాపై ఢిల్లీకి మంచి రికార్డే ఉంది. అక్టోబర్‌ 3న షార్జా క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై ఢిల్లీ జట్టు 18 పరుగులతో విజయం సాధించింది. ఇక తాజా సీజన్‌లో 10 మ్యాచ్‌లలో 5 విజయాలు సాధించిన కోల్‌కతాకు ఈ మ్యాచ్‌ కీలకం కానుంది. హైదరాబాద్‌, పంజాబ్‌ జట్ల నుంచి పోటీనీ తట్టుకుని  ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఇయాన్‌ మోర్గాన్‌ సేన దూకుడు పెంచాలి.

జట్లు
ఢిల్లీ: అజింక్య రహానే, శిఖర్‌ ధావన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), రిషభ్‌ పంత్‌ (కీపర్‌), మార్కస్‌ స్టొయినిస్‌, షిమ్రాన్‌ హెయిట్‌మేర్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, కాసిగో రబడా, అన్రిచ్‌ నోర్ట్జే ,తుషార్‌ దేష్‌పాండే

కోల్‌కత: శుభ్‌మన్‌ గిల్‌, రాహుల్‌ త్రిపాఠి, నితీష్‌ రాణా, దినేష్‌ కార్తీక్‌ (కీపర్‌), ఇయాన్‌ మోర్గాన్ (కెప్టెన్‌)‌, ప్యాట్‌ కమిన్స్‌, లాకీ ఫెర్గూసన్‌, ప్రసిధ్‌ క్రిష్ణ, వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌, కమలేష్‌ నాగర్‌కోటి.

Poll
Loading...
Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు