ఏబీ డివిలియర్స్‌@ 200

22 Sep, 2020 16:17 IST|Sakshi

దుబాయ్‌: ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఏబీ డివిలియర్స్‌ అరుదైన ఘనతను సాధించాడు. ఆర్సీబీ తరఫున 200 సిక్స్‌లను సాధించాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో డివిలియర్స్‌ 214 సిక్స్‌లు కొట్టగా, అందులో ఆర్సీబీ తరఫున సాధించినవి 200 సిక్‌లు ఉండటం విశేషం. 2011 నుంచి ఆర్సీబీకి ఆడుతున్న డివిలియర్స్‌.. తాజా సీజన్‌లో సోమవారం​ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్‌ సాధించాడు. ఎస్‌ఆరహెచ్‌ బౌలర్‌ సందీప్‌ శర్మ వేసిన స్లో డెలివరీని సిక్స్‌గా కొట్టడం ద్వారా ఆర్సీబీ తరఫున 200 సిక్స్‌ను ఖాతాలో వేసుకున్నాడు. (చదవండి: గంగూలీ ఢిల్లీని నడిపిస్తున్నాడా?)

ఏబీడీ 30 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లతో 51 పరుగులు చేశాడు. టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో  ఆర్సీబీ బ్యాటింగ్‌కు దిగింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను కేరళ కుర్రాడు దేవదూత్‌ పడిక్కల్‌, అరోన్‌ ఫించ్‌లు ఆరంభించారు. వీరిద్దరూ దాటిగా ఆడి ఆర్సీబీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా పడిక్కల్‌ దాటిగా బ్యాటింగ్‌ చేసి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగా, ఫించ్‌ మాత్రం కాస్త  నెమ్మదిగా ఆడాడు. పడిక్కల్‌ 42 బంతుల్లో 8ఫోర్లతో 56 పరుగులు చేశాడు.  రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు దెబ్బకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌల్డ్‌ అయ్యింది. సాధారణ స్కోరును సైతం ఛేదించలేక ఎస్‌ఆర్‌హెచ్‌ చతికిలబడింది. దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఒత్తిడిని జయించిన ఆర్సీబీ 10 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్‌ ఇంకా రెండు బంతులు ఉండగానే 153 పరుగులకు ఆలౌటై ఓటమి చవిచూసింది.(చదవండి: కేన్‌ విలియమ్సన్‌ అందుకే ఆడలేదా..)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు