Deaflympics 2022: షేక్‌ జాఫ్రీన్, భవాని జోడీలకు పతకాలు ఖాయం 

11 May, 2022 07:31 IST|Sakshi

బధిరుల ఒలింపిక్స్‌ క్రీడల్లో టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో షేక్‌ జాఫ్రీన్‌ (ఆంధ్రప్రదేశ్‌), భవాని కేడియా (తెలంగాణ) తమ భాగస్వాములతో కలిసి సెమీఫైనల్‌ చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో షేక్‌ జాఫ్రీన్‌–పృథ్వీ శేఖర్‌ (భారత్‌) జంట 6–1, 6–1తో టుటెమ్‌– ఎమిర్‌ (టర్కీ) జోడీపై నెగ్గగా... భవాని–ధనంజయ్‌ దూబే (భారత్‌) జోడీకి జర్మనీ జంట నుంచి ‘వాకోవర్‌’ లభించింది. 

మరిన్ని వార్తలు