Deaflympics 2022: చరిత్ర సృష్టించిన దీక్ష డాగర్‌.. భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం

12 May, 2022 14:06 IST|Sakshi

బ్రెజిల్‌లో జరుగుతున్న బధిరుల ఒలింపిక్స్‌ (డెఫిలింపిక్స్‌) క్రీడల్లో భారత మహిళా గోల్ఫర్‌ దీక్ష డాగర్‌ స్వర్ణ పతకంతో మెరిసింది. గురువారం అమెరికాకు చెందిన యాష్లిన్‌ గ్రేస్‌ జాన్సన్‌తో జరిగిన ఫైనల్లో 5-4తో ఓడించి స్వర్ణం చేజెక్కించుకుంది. కాగా డెఫిలింపిక్స్‌లో దీక్ష డాగర్‌కు ఇది రెండో పతకం. ఇంతకముందు 2017 ఆమె రజతం గెలిచింది.

ఓవరాల్‌గా డెఫిలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ఏకైక భారత గోల్ఫర్‌గా దీక్ష డాగర్‌ చరిత్ర సృష్టించింది. ఇక 2020 టోక్యో ఒలింపిక్స్‌లో చివరి నిమిషంలో అర్హత సాధించిన దీక్ష డాగర్‌.. ఒలిపింక్స్‌తో పాటు డెఫిలింపిక్స్‌ ఆడిన తొలి గోల్ఫ్‌ ప్లేయర్‌గానూ చరిత్ర సృష్టించింది. అంతకముందు బుధవారం జరిగిన సెమీఫైనల్లో 21 ఏళ్ల దీక్ష... అండ్రియా హోవ్‌స్టెయిన్‌ (నార్వే)పై విజయం సాధించింది. ఇక బధిరుల ఒలింపిక్స్‌లో భారత్‌ తాజా దానితో కలిపి ఇప్పటివరకు 10 పతకాలు గెలుచుకుంది. ఇందులో ఏడు స్వర్ణాలు, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి.

చదవండి: Asia Cup: ఆర్చరీలో భారత్‌ అదుర్స్‌  

మరిన్ని వార్తలు